TDP B Forms Live Updates: గెలుపు గుర్రాలకు చంద్రబాబు బీఫామ్‌లు.. ఇక యుద్ధమే!
ABN , First Publish Date - Apr 21 , 2024 | 11:42 AM
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) సమయం ఆసన్నమైంది. దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం (Telugu Desam) పార్టీ ఓల్టేజ్ పెంచింది!. 144 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 17 మంది పార్లమెంట్ అభ్యర్థులను టీడీపీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో చేసిన మార్పులు, చేర్పులు.. కూటమికి ఇచ్చిన స్థానాలతో ఆగ్రహావేశాలు ఇలా ఎన్నెన్నో జరిగాయి. ఆఖరికి నామినేషన్లకు సమయం ఆసన్నమైంది. ఆదివారం నాడు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు చంద్రబాబు బీఫామ్‌లు ఇచ్చి.. ప్రమాణం కూడా చేయించారు.
Live News & Update
-
2024-04-21T14:00:59+05:30
ఆశీర్వాదాలు!
నారా లోకేష్‌కు బీఫామ్ అందజేసిన చంద్రబాబు
మంగళగిరి నుంచి రెండోసారి పోటీచేస్తున్న లోకేష్
తండ్రి హోదాలో చంద్రబాబు నుంచి ఆశీస్సులు తీసుకున్న లోకేష్
-
2024-04-21T13:00:24+05:30
రఘురామకు బీఫామ్.. రేపే నామినేషన్
ఇన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు తెర
చంద్రబాబు నుంచి బీఫామ్ తీసుకున్న రఘురామ కృష్ణంరాజు
ఉండి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘురామ
రేపు ఉదయం 10:30 గంటలకు నామినేషన్
పెదఅమిరంలోని స్వగృహం నుంచి..
భారీ ర్యాలీగా ఎమ్మార్వో ఆఫీసుకు బయల్దేరనున్న ఆర్ఆర్ఆర్
పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు పాల్గొనాలని పిలుపు
-
2024-04-21T12:18:36+05:30
బీఫామ్స్ తీసుకునే ముందు..!
చంద్రబాబు నివాసంలో అభ్యర్థులకు బీఫామ్స్ పంపిణీ
లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులకు బీఫామ్స్ అందిస్తున్న చంద్రబాబు
తొలుత లోక్‌సభ అభ్యర్థులకు బీఫామ్స్ పంపిణీ
అభ్యర్థులతో ప్రమాణం చేయించి బీఫామ్స్ అందిస్తున్న చంద్రబాబు
చంద్రబాబు నుంచి బీఫాం అందుకున్న రామ్మోహన్ నాయుడు
-
2024-04-21T12:05:55+05:30
బీఫామ్స్ తీసుకున్నాక..!
ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేస్తున్న చంద్రబాబు
బీఫామ్స్ పంపిణీ అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు భేటీ
ఎన్నికల్లో ప్రచార వ్యూహ, ప్రతి వ్యూహాలపై..
అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్న అధినేత చంద్రబాబు
-
2024-04-21T12:00:04+05:30
రండి తమ్ముళ్లు రండి.. తీసుకోండి!
చంద్రబాబు నివాసంలో అభ్యర్థులు బీఫామ్స్ పంపిణీ
లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులకు బీఫామ్స్ అందిస్తున్న చంద్రబాబు
తొలుత లోక్‌సభ అభ్యర్థులకు బీఫామ్స్ అందిస్తున్న చంద్రబాబు
చంద్రబాబు నుంచి బీఫాం అందుకున్న రామ్మోహన్ నాయుడు
-
2024-04-21T11:50:13+05:30
బీజేపీలోకి నల్లమల్లి!
అనపర్తి టికెట్‌పై వీడిన చిక్కుముడి
నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ నుంచి..
పోటీ చేయించేందుకు ఒప్పించిన టీడీపీ, బీజేపీ నేతలు
అంతకుముందు టీడీపీ నుంచే పోటీ చేస్తానన్న నల్లమిల్లి
చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి, బీజేపీ నేతలతో..
చర్చల అనంతరం బీజేపీ నుంచి పోటీకి నల్లమిల్లి అంగీకారం
త్వరలో బీజేపీలో చేరనున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
-
2024-04-21T11:45:54+05:30
అధినేత ఇంటికి తమ్ముళ్లు!
చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్న అభ్యర్థులు
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో కిటకిటలాడుతున్న కరకట్ట!
చంద్రబాబు నివాసం పరిసర ప్రాంతాలన్నీ పసుపుమయం
ఎటు చూసినా కార్లు.. అభ్యర్థులే కనిపిస్తున్న పరిస్థితి
-
2024-04-21T11:35:04+05:30
5 చోట్ల అభ్యర్థుల మార్పు..
బీఫామ్‌లు ఇచ్చే ముందు బిగ్ ట్విస్ట్‌లు
ఐదుగురు అభ్యర్థులను మార్చిన టీడీపీ అధినేత చంద్రబాబు
ఉండి : రఘురామకృష్ణ రాజు
పాడేరు : గిడ్డి ఈశ్వరి
మడకశిర : ఎమ్మెస్ రాజు
వెంకటగిరి : కురుగుండ్ల రామకృష్ణ
మాడుగుల : బండారు సత్యనారాయణ మూర్తి
-
2024-04-21T11:30:09+05:30
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) సమయం ఆసన్నమైంది. దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం (Telugu Desam) పార్టీ ఓల్టేజ్ పెంచింది!. 144 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 17 మంది పార్లమెంట్ అభ్యర్థులను టీడీపీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో చేసిన మార్పులు, చేర్పులు.. కూటమికి ఇచ్చిన స్థానాలతో ఆగ్రహావేశాలు ఇలా ఎన్నెన్నో జరిగాయి. ఆఖరికి నామినేషన్లకు సమయం ఆసన్నమైంది. బీఫామ్‌లు ఇచ్చేముందు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బోలెడెన్ని ట్విస్టులు ఇచ్చారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేయడంతో తెలుగు తమ్ముళ్లు షాక్ తిన్నారు. ఇదంతా బీఫామ్స్ ఇచ్చేముందు జరగడంతో కొందరు నేతలు తీవ్ర అసంతృప్తికి లోనైనప్పటికీ.. వారిని పిలిపించి బుజ్జగించే పనిలో చంద్రబాబు, సీనియర్లు ఉన్నారు. మరోవైపు ఇవాళే మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బీఫామ్‌లను చంద్రబాబు స్వయంగా తన చేతుల మీదుగా ఇస్తున్నారు. ఉండి అసెంబ్లీ నుంచి రఘురామకృష్ణ రాజు, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మడకశిర నుంచి ఎమ్మెస్ రాజు, వెంకటగిరి నుంచి కురుగుండ్ల రామకృష్ణ, మాడుగుల నుంచి బండారు సత్యనారాయణ మూర్తిని అభ్యర్థులుగా చంద్రబాబు ప్రకించారు. వీరంతా చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. బీఫామ్స్ పంపిణీ అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు కీలక భేటీ కానున్నారు. ఈ సందర్భంగా.. ఎన్నికల్లో ప్రచార వ్యూహ, ప్రతి వ్యూహాలపై అభ్యర్థులకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.