Home » Nara Chandra Babu Naidu
నిజం గెలవాలి ఎన్డీఏ రావాలి హ్యాష్ ట్యాగ్.. దేశవ్యాప్తంగా ఎక్స్ ఖాతాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై చనిపోయిన అన్నీ కుటుంబాలని నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి పరామర్శించారు.
నవరత్నాలతో సీఎం జగన్ (CM Jagan) ప్రజలను మోసం చేశారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. శనివారం నాడు కదిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నరసింహ స్వామి కదిరి ప్రాంతాన్ని కాపాడుతున్నారని తెలిపారు.
ఏపీ సార్వత్రిక ఎన్నిక ( AP Election 2024)ల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుడంటంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గెలుపు వ్యూహాలపై పదును పెట్టారు. ఇందులో భాగంగానే బాపట్ల పార్లమెంట్‌లోని అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశానికి కూటమి నేతలు కూడా హాజరయ్యారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ను అడ్వకేట్ గుణ్ణం వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను కుటుంబం గురువారం కలిసింది.
అమరావతి: ఎన్నికల పుణ్యమా అని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, రాజాం ప్రధాన రహదారికి మోక్షం లభించింది. రాజాం నుంచి పాలకొండ వెళ్లే ప్రధాన రహదారిని ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది.
‘సంక్షేమం పేరుతో నిధులన్నీ దోచేసింది చాలక రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేశాడు. హైకోర్టు మినహా ఏమీ మిగలనివ్వలేదు. మొత్తం దోచేసి జేబులు నింపుకొని తినేస్తున్నాడు. ఇక మిగిలింది ప్రజల ఆస్తులే. అవైనా ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. చంద్రబాబు తెచ్చిన పఽథకాలను ఆపేసి పేదల జీవితాల్లో అంధకారం నింపిన రాక్షసుడు జగన్మోహన్రెడ్డి. ఇలాంటి రాక్షసుణ్ణి తరిమేయడానికి రేపటి ఎన్నికల్లో ఓటనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) పిలుపునిచ్చారు.
బాపట్ల జిల్లా: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాగళంలో భాగంగా శుక్రవారం ఆయన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలో ప్రజాగళం సభలు నిర్వహిస్తారు.
ప్రశాంతతకు మారుపేరైన కోనసీమలో సీఎం జగన్ కులచిచ్చు పెట్టాలని చూశాడని టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ఒక్క చాన్సిస్తే రాష్ట్రాన్ని మాఫియా రాజ్ చేశారని.. మళ్లీ అవకాశమిస్తే రాష్ట్రం ఖాళీ అయిపోతుందని హెచ్చరించారు. దళితులపై దాడులు పెరిగిపోయాయని, జగన్ పాలనలో వారికి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ వర్గాలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేలు పింఛనుగా ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం ఆయనకు నివాళి అర్పించారు. ఆయన స్ఫూర్తితో బీసీలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళిక తెచ్చిన ఘనత టీడీపీదేనన్నారు.
|పీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ (YSRCP) అక్రమాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ (Dr. A.S. Ramakrishna) అన్నారు. గురువారం నాడు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను తెలుగుదేశం పార్టీ నేతలు ఏఎస్ రామకృష్ణ, మన్నవ సుబ్బారావు, ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.