Chandrababu: ఎన్నికలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ABN , Publish Date - Apr 13 , 2024 | 03:41 PM
ఏపీ సార్వత్రిక ఎన్నిక ( AP Election 2024)ల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుడంటంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గెలుపు వ్యూహాలపై పదును పెట్టారు. ఇందులో భాగంగానే బాపట్ల పార్లమెంట్‌లోని అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశానికి కూటమి నేతలు కూడా హాజరయ్యారు.
బాపట్ల జిల్లా: ఏపీ సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుడంటంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గెలుపు వ్యూహాలపై పదును పెట్టారు. ఇందులో భాగంగానే బాపట్ల పార్లమెంట్‌లోని అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశానికి కూటమి నేతలు కూడా హాజరయ్యారు.
Nara Lokesh: నీ ప్రచారం పిచ్చి తగలెయ్యా.. ఆఖరుకు ఆయన్నూ వదలలేదా..
మొదట రేపల్లె నియోజకవర్గం నేతలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అభ్యర్థుల బలాబలాలపై బేరీజు వేసుకుంటున్నారు. అధికార వైసీపీని ఎన్నికల్లో ఎలా ఢీకొట్టాలనే అంశంపై కూటమి నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ నేతలు ప్రచారం చేయాలని సూచించారు.
AP Elections: గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నానికి బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ సీనియర్ నేత
అధికార వైసీపీ ఆగడాలను తన దృష్టికి తీసుకువస్తే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకుంటానని చంద్రబాబు అన్నారు. అలాగే చంద్రబాబును మచిలీపట్నం ఎంపీ బాలశౌరీ తన కొడుకుతో కలిశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ మరింతంగా సహకరించేలా చేయాలని చంద్రబాబును బాలశౌరి కోరారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కూటమి అధికారంలోకి రావడం ఖాయమని బాలశౌరి ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
Elections 2024: అభ్యర్థి అవినాశ్ ను మార్చేందుకు యత్నాలు.. కుండ బద్దలు కొట్టిన షర్మిల..
జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి..
మరిన్ని ఏపీ వార్తల కోసం...