Chandrababu: బీసీలకు 50 ఏళ్లకే 4 వేల పింఛను
ABN , Publish Date - Apr 12 , 2024 | 07:13 AM
రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ వర్గాలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేలు పింఛనుగా ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం ఆయనకు నివాళి అర్పించారు. ఆయన స్ఫూర్తితో బీసీలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళిక తెచ్చిన ఘనత టీడీపీదేనన్నారు.
రూ.లక్షన్నర కోట్లతో సబ్ ప్లాన్: చంద్రబాబు
చంద్రన్న బీమా పది లక్షలకు పెంపు
శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు
అమరావతి, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ వర్గాలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేలు పింఛనుగా ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం ఆయనకు నివాళి అర్పించారు. ఆయన స్ఫూర్తితో బీసీలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళిక తెచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. ‘బీసీలకు రూ.లక్షన్నర కోట్లతో సబ్ ప్లాన్ అమలు చేస్తాం. వారి స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం. వృత్తిదారులు, చేతి పనుల వారికి ఆదరణ పథకం కింద రూ.5 వేల కోట్ల విలువ చేసే పరికరాలు అందిస్తాం. చంద్రన్న బీమా పఽథకాన్ని పునరుద్ధరించి పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతాం. పెళ్లి కానుకనూ రూ.లక్షకు పెంచుతాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతానికి మళ్లీ పెంచడానికి పోరాడతాం. బీసీలు ప్రతిసారీ కుల ధ్రువీకర ణ పత్రం కోసం కా ర్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకు ండా శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం’ అని పేర్కొన్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తామన్నారు.
మత విద్వేషాల సృష్టికి.. జగన్ వేచి చూస్తునా్నడు: బాబు
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికల ముందు మత విద్వేషాలు సృష్టించడానికి జగన్ దొంగలా వేచిచూస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తన గొంతులో ప్రాణముండగా ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు అన్యాయం జరగనివ్వనన్నారు. రంజాన్‌ను పురస్కరించుకుని గురువారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 1999, 2014లో కూడా టీడీపీ, బీజేపీ కలసి ప్రభుత్వం ఏర్పాటుచేశాయని... ఎప్పుడూ ముస్లిం, మైనారిటీల హక్కులు హరించలేదని గుర్తుచేశారు. ‘ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు పెట్టి, వాటిని సుప్రీంకోర్టులో కాపాడింది టీడీపీయే. మా ముస్లింలు, మా మైనారిటీలు అనే జగన్ ఏం చేశాడు? కనీసం రిజర్వేషన్లను కూడా కాపాడలేకపోయాడు.
మేం అధికారంలోకి వస్తున్నాం. వచ్చిన వెంటనే 4 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తాం. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి పార్లమెంటులో సపోర్ట్ చేసింది జగనే. ముస్లింలకు తీవ్ర అన్యాయం చేసిన ద్రోహి. మైనారిటీ కార్పొరేషన్ మేమే ఏర్పాటుచేశాం. హైదరాబాద్‌లో ఉర్దూ వర్సిటీ పెట్టించాను. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేశాను. హజ్ హౌస్‌లు కట్టింది, వాటికి ఆర్థిక సాయం చేసింది కూడా మేమే. పేద ముస్లింలను ఆదుకోవడానికి రంజాన్ తోఫా ఇచ్చాం. 10 లక్షల మందికి ఇచ్చాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఇస్తోందా? సంక్రాంతి కానుక కూడా ఇచ్చాం. పెళ్లిళ్లకు రూ.50 వేల ఆర్థిక సాయం చేశాం. మసీదులకు ఆర్థిక సహాయం చేశాం. ఇమామ్‌లకు గౌరవ వేతనాలు ఇచ్చాం. ఏదీ.. జగన్ ఇస్తున్నాడా? ముస్లిం పిల్లల కోసం విదేశీ విద్య పెట్టి రూ.15 లక్షలు అందించాం. ఈరోజు అన్నీ పోయాయి’ అని స్పష్టంచేశారు.