Home » Nara Chandra Babu Naidu
నాల్గవసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని... బుధవారం ఉదయం బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో పురాణపండ శ్రీనివాస్ రచనలైన మంగళగిరి నృసింహ భగవానునిపై ప్రచురించిన ‘నారసింహో... ఉగ్రసింహో’ దివ్యగ్రంధాన్ని, బెజవాడ కనకదుర్గా శక్తి స్వరూపంపై ప్రచురించిన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని సరస్వతీపుత్రులు, ఉపన్యాస కేసరి చాగంటి కోటేశ్వర రావు ఆవిష్కరించారు. ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఈ సౌందర్య వంతమైన దైవబలాల గ్రంధాలను సౌజన్యభరితంగా సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (గురువారం) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల చేరుకొని అతిథి గృహం వద్ద బస చేశారు. సీఎం చంద్రబాబు బస చేసే అతిథి గృహం పక్కన పరదాలు కట్టారు. ఈ అంశంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌కు నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి దంపతుల క్షేమం కోరుతూ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య ప్రచురించిన, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన కస్తూరీ చందనంలాంటి రెండు అపురూప గ్రంధాలు సుమారు ఐదువందల పుస్తకాలు కరకట్ట వద్ద ఉన్న ఉండవల్లిలోని రాష్ట్రముఖ్యమంత్రి నివాసానికి చేరాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరగ్గా శాసన సభ పక్షనేతతో పాటు సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు ఎన్నుకున్నారు. సమావేశంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతానని తాను చేసిన శపధాన్ని ప్రజలు గౌరవించారని.. ప్రజల గౌరవాన్ని నిలపెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై టీడీపీ కూటమి పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని కూటమి వర్గాలు తెలిపాయి.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం మంగళవారం ఉదయం జరగనున్నది. ఈ భేటీలో ఎన్డీయే శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. చంద్రబాబు నివాసంలో లేదా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది.
బొగ్గు, గనులు దేశానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశాభివృద్ధిలో బొగ్గు పాత్ర కీలకమని, నల్లబంగారం వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై ఆ శాఖ మంత్రిగా తాను పనిచేయాల్సి ఉంటుందన్నారు.
అమరావతి: రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే వందకు పైగా జేసీబీ యంత్రాలు కంప, పిచ్చి చెట్లను తొలగించే పనులలో దుమ్మురేపుతున్నాయి. రాత్రిళ్లు కూడా యంత్రాలు పనులు చేస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం 217 చదరపు కిలోమీటర్ల రాజధాని అమరావతిలో 32 పెద్ద రోడ్లను నిర్మాణం చేయటానికి టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది.
అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతూ స్టేజి సిద్ధం చేశారు.