Share News

Chandrababu: శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకోనున్న కూటమి

ABN , Publish Date - Jun 11 , 2024 | 06:55 AM

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం మంగళవారం ఉదయం జరగనున్నది. ఈ భేటీలో ఎన్డీయే శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. చంద్రబాబు నివాసంలో లేదా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది.

Chandrababu: శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకోనున్న కూటమి

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి (TDP Kutami) తరఫున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం మంగళవారం ఉదయం జరగనున్నది. ఈ భేటీలో ఎన్డీయే శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని (Chandrababu) కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. చంద్రబాబు నివాసంలో లేదా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఉదయం 9:30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.


అనంతరం తీర్మానం ప్రతిని కూటమి ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి అందజేయనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాగా ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి.


కాగా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా హాజరు కానున్నారు. సాధారణంగా ఏదైనా కార్యక్రమానికి మోదీ, అమిత్‌షాల్లో ఒకరు మాత్రమే హాజరు అవుతుంటారు. కానీ దీనికి మాత్రం ఇద్దరూ వస్తున్నారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ అధినేత ప్రాధాన్యానికి ఇది నిదర్శనంగా చెబుతున్నారు. మరి కొందరు కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తమిళనాడు నుంచి కొందరు మంత్రులతో ఒక సౌహార్ద్ర ప్రతినిధి బృందం హాజరవుతోంది. పోయినసారి జగన్మోహన రెడ్డి ప్రమాణ స్వీకారానికి తెలంగాణ అప్పటి సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌ హాజరయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానాలను ఎన్డీయే కూటమి సీఎంలకే పరిమితం చేయడంతో పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావడం లేదు. వేదికను బాగా విశాలంగా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు ఏభై వేల మంది కూర్చోవడానికి వీలుగా మైదానంలో కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. అంతకు మించి వచ్చిన వారు ప్రాంగణం బయట ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. వారి కోసం ప్రాంగణం బయట డిజిటల్‌ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ జిల్లాల్లో వస్తున్న స్పందనను బట్టి ఈ సభకు సుమారుగా లక్ష నుంచి లక్షన్నర మంది హాజరు కావచ్చునని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పది వేల వాహనాలు రావచ్చునన్న లెక్కతో వాటికి సరిపోను పార్కింగ్‌ సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు.


జగన్‌ బాధితులకు ప్రత్యేక ఆహ్వానం

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథులుగా జగన్‌ బాధితులు హాజరవుతున్నారు. జగన్‌ ప్రభుత్వంలో వేర్వేరు కారణాలతో బాధితులుగా మారిన 112 మందిని గుర్తించి, వారికి ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపించారు. కర్నూలు జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారంటూ కుటుంబంతో సహా సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్‌ సలాం బంధువులను ఈ కార్యక్రమం కోసం పిలిచారు. అలాగే, ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులకు ఆహ్వానం అందింది. కరోనా సమయంలో మాస్క్‌లు అడిగిన నర్సీపట్నం డాక్టర్‌ సుధాకర్‌ను వేధించి ఆయన చావుకు సర్కార్‌ కారణమైంది. ఆయన కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బాబు కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ

జే బ్రాండ్లకు చెక్‌..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 11 , 2024 | 06:58 AM