Home » Nara Chandra Babu Naidu
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిపట్ల తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఆయన సతీమణి భువనేశ్వరి కూడా సంతాపం ప్రకటించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 4వ సారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) మరణించారని తెలుసుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న బాబు.. హైదరాబాద్‌కు వచ్చి రామోజీరావు పార్థివదేహానికి కన్నీటి నివాళులు అర్పించారు.!
మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనమంటూ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth)కు ఆహ్వానం అందింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్.. ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోగా ఊహించని రీతిలో కూటమి సీట్లు దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను..’ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) కూటమి గెలిచిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు, నేతలపై వైసీపీ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) తీవ్రంగా స్పందించారు..
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈరోజు రాత్రికి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు(శుక్రవారం) ఎన్డీఏ పక్షాల పార్లమెంట్ సభ్యుల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఎల్లుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసే అవకాశం ఉంది.
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద సందడి వాతావరణం కొనసాగుతోంది. ఆయనను కలిసేందుకు టీడీపీ నేతలు, పలువురు ఉన్నతాధికారులు వస్తున్నారు. గురువారం ఉదయం చంద్రబాబును కలిసేందుకు మాజీ డీ.జీ ఏ.బి వెంకటేశ్వరరావు వచ్చారు.
16 ఎంపీ సీట్లు ఉన్న టీడీపీకి కేంద్ర కేబినెట్లోకి చోటు ఉంటుందా.. లేదా..? ఉంటే ఎవరెవర్ని మంత్రి పదవులు వరించొచ్చు..? అనేదానిపై ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఒక్కటే చర్చ జరుగుతోంది..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) కూటమి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) జూన్-09న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే..