Chandrababu: కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు
ABN , Publish Date - Jun 08 , 2024 | 04:28 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 4వ సారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అమరావతి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 4వ సారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారం కోసం కేసరపల్లిలోని ఓ స్థలాన్ని, మంగళగిరిలోని ఎయిమ్స్ దగ్గర ఉన్న మరో స్థలాన్ని మొదటగా పరిశీలించారు. అయితే కేసరపల్లిలోని స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ నెల12వ తేదీన ఉదయం 11 గంటల ప్రాంతం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
అయితే కేసరపల్లిలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులను అధికార యంత్రాంగం, టీడీపీ ప్రోగాం కమిటీ సభ్యులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణానికి నిర్మాణ సామగ్రి, వాహనాలు చేరుకున్నాయి. సుమారు 20 ఎకరాల్లో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేపట్టారు. కేంద్రం నుంచి అదనపు బలగాలు కూడా ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. నిన్న(శుక్రవారం) ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ స్థలాన్ని పరిశీలించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ స్థలాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
Ramoji Rao: రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి
Ramoji Rao: రామోజీరావు నా రోల్ మోడల్: ఎమ్మెస్ కే ప్రసాద్
TG News: చేప మందు కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు పోటెత్తిన ప్రజలు..
TG Politics: కేసీఆర్, జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు: ఎమ్మెల్యే వివేక్
Read Latest AP News and Telugu News