Share News

Chandrababu: చంద్రబాబు అనే నేను.. ప్రమాణం ఎప్పుడంటే..?

ABN , Publish Date - Jun 07 , 2024 | 07:54 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్.. ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోగా ఊహించని రీతిలో కూటమి సీట్లు దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను..’ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు..

Chandrababu: చంద్రబాబు అనే నేను.. ప్రమాణం ఎప్పుడంటే..?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్.. ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోగా ఊహించని రీతిలో కూటమి సీట్లు దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను..’ ఎప్పుడెప్పుడు ఉంటుందా..? అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు ముహూర్తం ఫిక్స్ అయ్యిందని వార్తలు రావడం.. ఢిల్లీ పర్యటన తర్వాత మళ్లీ మార్పులు, చేర్పులు జరిగాయి. అయితే.. టీడీపీ అధికారికంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు..? ఎన్ని గంటలకు..? ఎక్కడ అనే దానిపై క్లియర్ కట్‌గా ప్రకటన చేసింది.


Chandrababu.jpg

... అనే నేను ఎప్పుడు..?

జూన్-12న బుధవారం ఉదయం 11:27 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మొదట మంగళగిరి ఎయిమ్స్ స్థలం బాగుంటుందని భావించినప్పటికీ.. దీని కంటే ఐటీ పార్క్ స్థలం అనువైనదిగా తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. ఢిల్లీ పర్యటన నుంచి చంద్రబాబు రాగానే.. సభా స్థలంపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు.. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ శ్రీకారం సభా స్థలాన్ని అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్, మంతెన సత్యనారాయణ రాజు, పెందుర్తి వెంకటేష్‌తో పాటు పలువురు నేతలు పరిశీలించారు. కాగా.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రానున్న నరేంద్ర మోదీ, ఎన్డీఏ రాష్ట్రాల నేతలు, పలువురు ముఖ్యమంత్రులు రానున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీలో ఘర్షణలపై చంద్రబాబు రియాక్షన్..

Updated Date - Jun 07 , 2024 | 07:55 PM