Home » Nara Lokesh
రెండు రోజుల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతోంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి (మంగళగిరి టౌన్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలను మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతోంది.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో పెద్దఎత్తున విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. ట్రిపుల్ ఐటి డైరక్టర్‌ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు సభ్యులతో పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరగబోతున్న వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. వినాయచవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాల నిర్వాహకులకు..
Andhrapradesh: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. విద్యార్థినుల ఆందోళనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నానని... హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాల లెక్కలన్నీ బయటపెడతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. అక్రమాలకు బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి లోకేష్..
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా నేడు ఆయన విశాఖపట్నం చేరుకోనున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం తొలిసారిగా మంత్రి నారా లోకేశ్.. జిల్లాకు రానుండడంతో పార్టీ శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
గత ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారని మంత్రి నారా లోకేశ్ గుర్తుచేశారు. అయినప్పటికీ ఆ పార్టీకి గుణపాఠం రాలేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Andhrapradesh: తణుకు అన్న క్యాంటీన్లో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలే అని అన్నారు. విషప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 28వ తేదీన విశాఖ నగరానికి వెళ్లనున్నారు. నాలుగు రోజుల పాటు లోకేష్ విశాఖలోనే పర్యటించనున్నారు.