Ganesh Chaturthi: వినాయకుడిని పెడుతున్నారా? ఒక్క క్లిక్‌తో పర్మిషన్ తీసుకోండి..
ABN , Publish Date - Aug 30 , 2024 | 09:51 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరగబోతున్న వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. వినాయచవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాల నిర్వాహకులకు..
అమరావతి, ఆగష్టు 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరగబోతున్న వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. వినాయచవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతుల కోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను ప్రభుత్వం రూపొందించింది.
ఇక్కడ అప్లై చేసుకోండి..
వినాయక మండపాలు ఏర్పాటు చేసే వారు ప్రభుత్వ వెబ్ సైట్ https://ganeshutsav.net ద్వారా అవసరమైన అనుమతులను తీసుకోవచ్చు. సింగిల్ విండో విధానంలోనే అన్ని అనుమతులు ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల నిర్వాహకులు ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించి అనుమతులు తీసుకోవచ్చునని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు.
వినాయక చవితి ఎప్పుడు..
ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీన వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో గణేషుడి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. వాడ వాడల గణేషుడి మండపాలు ఏర్పాటు చేసి ఆ గణనాథుడిని పూజిస్తారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా అనుమతులు తీసుకునే అవకాశం కల్పించిన సర్కార్.. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.