Nara Lokesh: ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటన
ABN , Publish Date - Sep 01 , 2024 | 11:22 AM
అమరావతి (మంగళగిరి టౌన్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలను మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతోంది.
అమరావతి (మంగళగిరి టౌన్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలను మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పర్యటిస్తున్నారు. ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళగిరి ప్రాంతంలో వరద నీరు చేరింది. అనేక చోట్లకు నీరు చేరి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ముంపుకు గురైన రత్నాల చెరువు ప్రాంతంలో మంత్రి పర్యటిస్తున్నారు. పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించిన మంత్రి నారా లోకేష్ బాధితులతో ముఖా ముఖి మాట్లాడారు. ప్రభుత్వం తరపున అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అధికారులు మంత్రి లోకేష్‌కు వివరించారు. ప్రభుత్వ సాయం అందరికీ అందుతుందా అంటూ మంత్రి నారా లోకేష్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, పార్టీ శ్రేణులు నిన్నటి నుండి అందుబాటులో ఉండి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని బాధితులు మంత్రికి చెప్పారు.
ఎడతెరిపి లేకుండా కరుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణాజిల్లాలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షాలు, వరదల వల్ల ప్రజలు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్‌లు.. 9491063910, 08672 252090 సంప్రదించాలని అధికారులు సూచించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేస్తూ లోతట్టు ప్రాంతాల పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుకోని విపత్తు ఎదురైతే వెంటనే కృష్ణాజిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబరుకు ఫొన్ చేసి సహాయం పొందాలన్నారు. కృష్ణా, గన్నవరం నుంచి ఆగిరిపల్లి పోయే ప్రధాన రహదారిపై గొల్లనపల్లి గ్రామ సమీపంలో వాగు పొంగుతోంది.
కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలతో ముంచెత్తుతోంది. వర్షాల ధాటికి నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. పంటలు నీట ముగిని తీవ్రనష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 12:30 నుంచి 2:30 మధ్య వాయుగుండం తీరం దాటింది. క్రమంగా బలహీనపడుతూ వాయువ్య దిశగా దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా వాయుగుండం పయనిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొంతవరకు వర్షాలు తగ్గుముఖం పడతాయని, చాలా చోట్ల చెదురు మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జలదిగ్బంధంలో రాయనపాడు రైల్వే స్టేషన్
వాగులో కొట్టుకుపోయి యువకుడి మృతి
చంద్రబాబు పథకాలు దేశానికే ఆదర్శం
ఇంతకంటే నీతిమాలిన చర్య ఉంటుందా ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News