Home » National News
కామిక్ టైమింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్న రాజ్‌పాల్ యాదవ్ ఇటీవలే విడుదలైన కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్ చిత్రం 'భూల్ భులియా 3'లో కూడా నటించాడు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లా పాలియా టౌన్లో దీపావళి గురించి ఓ ప్రాతికేయుడు ప్రశ్నించగా ఆయన మండిపడ్డాడు.
కేరళలోని రైల్వే ట్రాక్‌పై విషాదం చోటు చేసుకుంది. కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొని నలుగురు కార్మికులు మరణించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భరత్ పూజ నదిపై ఉన్న రైల్వే ట్రాక్‌పై ఈ నలుగురు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి విషపూరితంగా మారింది. దీపావళి జరిగిన రెండు రోజుల తర్వాత నేడు (ఆదివారం) ఉదయం 5 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 మార్కును దాటేసింది. దీంతో వాయు కాలుష్యం 'ప్రమాదకర' స్థాయికి చేరుకుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉగ్రదాడులు పెరుగుతుండటం వెనుక తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర ఉండవచ్చనే అనుమానం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇటీవల బుద్గాం ఉగ్రదాడి ఘటనపై విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
షైని ఎన్సీపై అనుచిత వ్యాఖ్యల వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఉద్దేశపూర్వకంగానే కొందరు తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కెనడా గడ్డపై ఖలిస్థానీ సానుభుతిపరులపై దాడుల వెనుక భారత్ పాత్ర ఉందంటూ ఆ దేశ మంత్రి డేవిడ్ మోరిసన్ ఆరోపణలు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు ఇండియన్ ఆర్మీ ధ్రువీకరించింది. హల్కాన్ గలిలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో బలగాలు గాలింపు ముమ్మరం చేశాయని, ఇది గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బలగాలు తీవ్రంగా ప్రతిఘటించాయని తెలిపింది.
కాళీ మాత నిమ్మజం ఊరేగింపుపై దాడులకు దిగిన దుండగులపై మమతా బెనర్జీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. తక్షణం చర్చలు తీసుకోవాలని, లేదంటే సీఎం రాజీనామా చేయాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధామ్ కేదార్నాథ్ ఆలయం రేపటి నుంచి ఆరు నెలల బంద్ కానుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. అయితే ఎందుకు ఆలయం క్లోజ్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద టెన్షన్ రెబల్ నేతల నామినేషన్లను ఉపసంహరించడం. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 50 చోట్ల తిరుగుబాటు నేతలు నామినేషన్లు దాఖలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.