Kali immersion: కాళీ నిమజ్జనం ఊరేగింపుపై రాళ్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత
ABN , Publish Date - Nov 02 , 2024 | 02:51 PM
కాళీ మాత నిమ్మజం ఊరేగింపుపై దాడులకు దిగిన దుండగులపై మమతా బెనర్జీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. తక్షణం చర్చలు తీసుకోవాలని, లేదంటే సీఎం రాజీనామా చేయాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు.
కోల్‌కతా: హిందువుల పండుగల్లో అగంతకులు రాళ్లురువ్వడం, ఉద్రిక్తలు చెలరేగడం వంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. కోల్‌కతా (Kolkata)లోని రాజ్‌బజార్ ప్రాంతంలో కాళీ విగ్రహ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఊరేగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. ఊరేగింపుపై అగంతకులు రాళ్లు రువ్వడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. అయితే, రాళ్లురువ్వారంటూ వస్తున్న వార్తలను కోల్‌కతా పోలీసులు ఒక ప్రకటనలో ఖండించారు. ఎలాంటి లక్షిత దాడులు జరగలేదని, కేవలం పార్కింగ్ విషయంలో ఘర్షణ తలెత్తినట్టు తెలిపింది. శాంతి భద్రతలపై గట్టి నిఘా ఉంచామని పేర్కొంది.
మమత రాజీనామా చేయాలి: బీజేపీ
కాళీ మాత నిమ్మజం ఊరేగింపుపై దాడులకు దిగిన దుండగులపై మమతా బెనర్జీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. తక్షణం చర్చలు తీసుకోవాలని, లేదంటే సీఎం రాజీనామా చేయాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు. హిందువులను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కోల్‌కతా పోలీసులు ఫెయిల్ : సువేందు
కాగా, రాష్ట్ర ప్రభుత్వ బుజ్జగింపు రాజకీయాల వల్లే హిందూ పండుగలపై దాడులు జరుగుతున్నాయంటూ బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మండిపడ్డారు. భక్తులపై దాడుల నుంచి రక్షణ కల్పించడంలో కోల్‌కతా పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. బెంగాల్‌లో పదేపదే హిందువుల పండుగలపై దాడులు జరుగుతున్నాయని, వీటిని నిరోధించడంలో విఫలమవుతున్న పోలీసులు ఆ బాధ్యతను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి: