Delhi Air Pollution: 500 మార్క్ దాటిన ఢిల్లీ వాయు కాలుష్యం.. స్థానికుల భయాందోళన
ABN , Publish Date - Nov 03 , 2024 | 09:40 AM
దేశ రాజధాని ఢిల్లీలో గాలి విషపూరితంగా మారింది. దీపావళి జరిగిన రెండు రోజుల తర్వాత నేడు (ఆదివారం) ఉదయం 5 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 మార్కును దాటేసింది. దీంతో వాయు కాలుష్యం 'ప్రమాదకర' స్థాయికి చేరుకుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో దీపావళి రోజున బాణసంచా కాల్చారు. ఆ తర్వాత కాలుష్యం కొద్దిగా పెరిగింది. కానీ ఇప్పుడు దీపావళి జరిగిన రెండో రోజు తర్వాత కూడా ఎయిర్ క్వాలిటీ అధ్వానంగా తయారైంది. కాలుష్యం తీవ్ర స్థాయి నుంచి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఆదివారం (నవంబర్ 3న) ఉదయం 5 గంటలకు ఢిల్లీలో వాయు కాలుష్యం(Air Pollution) స్థాయి 500 దాటేసి 'ప్రమాదకర' కేటగిరీకి చేరుకుంది. దీంతో ఇది ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిర్దేశించిన పరిమితి కంటే
దీపావళి జరిగిన రెండు రోజుల తర్వాత గాలి నాణ్యత తగ్గడం పట్ల అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. IQAir వెబ్‌సైట్ డేటా ప్రకారం దేశ రాజధానిని పొగమంచు దట్టంగా కప్పేసింది. ఈరోజు ఉదయం 5 గంటలకు AQI 507 వద్ద నమోదైంది. ఇది ఢిల్లీ-NCR పరిధిలో PM 2.5 స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన పరిమితి కంటే 65 రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. ఇది తెలిసిన నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రధానంగా ఈ ప్రాంతాల్లో
దేశ రాజధాని ఢిల్లీలో 12 గంటల్లోనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సంఖ్య 327 నుంచి 507కి పెరిగింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో శనివారం రాత్రి 9 గంటలకు AQI 327 వద్ద నమోదైంది. సమీర్ యాప్ ప్రకారం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB), అలీపూర్, ఆనంద్ విహార్, అశోక్ విహార్, అయా నగర్, బవానా, బురారీ, మధుర రోడ్, IGI విమానాశ్రయం, ద్వారక, జహంగీర్‌పురి, ముండ్కా ప్రాంతాల్లో గాలి నాణ్యత తగ్గింది. దీంతోపాటు నరేలా, పట్‌పర్‌గంజ్, రోహిణి, షాదీపూర్, సోనియా విహార్, వజీర్‌పూర్, మందిర్ మార్గ్, నెహ్రూ నగర్, నజఫ్‌గఢ్ ఇతర వాతావరణ పర్యవేక్షణ స్టేషన్‌లలో కూడా గాలి నాణ్యత తగ్గి్పోయింది.
12 గంటల్లో ఏం జరిగింది
దీపావళి తర్వాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 'తీవ్ర' స్థాయికి చేరుకోకపోవడానికి కారణం నిరంతరం వీస్తున్న బలమైన గాలులేనని నిపుణులు చెబుతున్నారు. శనివారం రాత్రి గాలి వేగం తగ్గడం వల్ల కాలుష్యం వేగంగా పెరిగిందని అంటున్నారు. ఇది కాకుండా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా ఉండటం కూడా ఓ కారణమని తెలిపారు. వాస్తవానికి తక్కువ ఉష్ణోగ్రతలు గాలి కదలికను నెమ్మదిస్తాయి. కాలుష్య కారకాలను భూమి ఉపరితలం పరిధిలో ఉంచుతాయి.
AQI ఎప్పుడు ప్రమాదకరమైనది?
ప్రమాణాల ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సున్నా నుంచి 50 మధ్య ఉన్నప్పుడు అది 'మంచి'గా పరిగణించబడుతుంది. 51 నుంచి 100 మధ్య ఉన్నప్పుడు అది 'సంతృప్తికరమైన' విభాగంలో ఉంటుంది. AQI 101 దాటి 200 కంటే తక్కువ ఉంటే అది మితమైనదని అర్థం. 201 నుంచి 300 మధ్యలో ఉంటే అది 'చెడు'గా పరిగణించబడుతుంది. అదే సమయంలో AQI 301 నుంచి 400 మధ్యకు చేరుకున్నప్పుడు, అది 'చాలా చెడు గాలిగా పరిగణిస్తారు. ఇక 401 నుంచి 500 మధ్య ఉన్నప్పుడు ఇది చాలా తీవ్రమైనది. ప్రజలకు హానికరమైన ఆరోగ్య సమస్యలను కల్గిస్తుంది.
ఇవి కూడా చదవండి:
No Cash Payments: పెట్రోల్ పంప్, సూపర్ మార్కెట్లలో నగదు చెల్లింపులు బంద్.. పోలీసుల ప్రకటన
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
Read More National News and Latest Telugu News