Home » NDA Alliance
ఏపీలో కూటమి విజయంపై అగ్రరాజ్యం అమెరికాలో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా మిన్నెసోటా రాష్ట్ర జంట నగరాలైన మిన్నియాపోలీస్, సెయింట్ పాల్లలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నారైలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఎన్డీయే మిత్రపక్షాలకు 292 మంది ఎంపీల బలం ఉంది. బీజేపీ సొంతంగా 240 మంది ఎంపీలున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అఖండ విజయం సాధించడంపై ఎన్ఆర్ఐలు(NRI) హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమది ప్రజా ప్రభుత్వమని.. దుర్మార్గపు ప్రభుత్వం కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ (Pithani Satyanarayana) వ్యాఖ్యానించారు. దుర్మార్గపు ప్రభుత్వం ఏదో ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఆ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు.
సీపీ నుంచి వచ్చే వారిని తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి డంపింగ్ యార్డ్ కాదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని నష్టపరిచి దాకోవడానికి, దాచుకోవడానికి వచ్చేవారిని కూటమిలో చేర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కొత్త ప్రస్థానం మొదటి అడుగు– ప్రభుత్వం ఏర్పాటు– లోనే తడబడ్డారు. దేశ ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలు ఆశాజీవులు. మరి కేంద్రంలో కొలువుదీరిన కొత్త సర్కార్ తన రెండవ, మూడవ అడుగులు– పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ సమర్పణ– ఎలా ఉండనున్నాయోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
నరేంద్ర మోదీ పాలనా శైలిలో ప్రతీకాత్మక సంయమనం చోటుచేసుకోవాలని నేను ఆశిస్తున్నాను; పార్లమెంటులో చర్చలకు మరింత సమయాన్ని కేటాయించి అవి సమగ్రంగా జరిగేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నాను. ప్రతిపక్షాల ప్రభుత్వాలు అధికారంలో..
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అనూహ్యమైన విజయాన్ని సాధించిందని, ఇది చిన్న విజయం కాదు.. అద్భుతమైన విజయమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
లోక్సభ ఎన్నికల అనంతరం ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ (రామ్ విలాస్) అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించాయి. తాజాగా భారత సైన్యం కూడా ఈ పథకాన్ని సమీక్షించి దాన్ని మెరుగుపర్చాలని సిఫారసు చేసింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రెగ్యులర్ సర్వీసుల్లో చేరే అగ్నివీర్ల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 25 నుంచి 60-70 శాతానికి పెంచాలనే సిఫారసు కూడా దీనిలో ఉంది.
కేంద్ర మంత్రులకు ఇచ్చే శాఖలపై క్లారిటీ వచ్చింది. అయితే చాలా శాఖలకు పాత వారినే కొనసాగించారు. వివిధ శాఖలకు మారిన మంత్రులెవరు, కొత్త మంత్రులెవరు అనేది తెలుసుకుందాం.