Share News

Purandeswari: గత పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు.. వైసీపీపై పురందేశ్వరి ఫైర్

ABN , Publish Date - Jun 20 , 2024 | 07:10 PM

గత జగన్ పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. బీజేపీ ఏపీ ఆధ్వర్యంలో విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాలులో ప్రజా ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు.

Purandeswari: గత పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు.. వైసీపీపై  పురందేశ్వరి ఫైర్
Daggubati Purandeswari

విజయవాడ: గత జగన్ పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. బీజేపీ ఏపీ ఆధ్వర్యంలో విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాలులో ప్రజా ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు. పురందేశ్వరి, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఏపీ మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, సోమూవీర్రాజు హాజరయ్యారు. కూటమి మీద ఉన్న విశ్వాసంతో తమను ప్రజలు ఆశీర్వదించారని తెలిపారు. బటన్ నొక్కి పథకాలు ఇస్తున్న అనే జగన్ అహంకారపూరితానికి ప్రజలు విసుగుచెందారని అన్నారు.


పొత్తులో భాగంగా ఎవరైతే సీటు ఆశించి,రాకపోయినా కూటమి కోసం ప్రతి ఒక్కరూ పని చేశారని వివరించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు పార్టీల కలయిక సమాజం కోసం పుట్టిన పార్టీలని చెప్పారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ నినాదంతో దేశ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మూడు పార్టీల నినాదంతో ఒక్కటై రాష్ట్ర అభివృద్ధికి అవసరమని ప్రజలు గమనించారన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పాలన అందించటానికి కూటమి ముందుకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు శ్రీకారం చుట్టారని ఉద్ఘాటించారు.


ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్వర్తించేలా కృషి చేస్తుందని వివరించారు. కూటమిలో ఉన్న ప్రజా ప్రతినిధులు, ఓటమి చెందిన నేతలు కానీ వారి నియోజకవర్గ ప్రజలు కోసం పని చేయాలని కోరారు. దేశ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర బీజేపీ నాయకులు అమిత్ షా, మోదీ ఆశయాలు ఏమైతే ఉన్నాయో వాటి కోసం నిరంతరం కృషి చేస్తారని మాటిచ్చారు.గెలుపు కోసం కష్ట పడిన ప్రతి కార్యకర్తకు దగ్గుబాటి పురందేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jun 20 , 2024 | 07:11 PM