Home » NDA
బెంగళూరులో ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకుని, ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై యుద్ధం ప్రకటించిన కొద్దిసేపటికే దేశ రాజధాని న్యూఢిల్లీలో బీజేసీ సారధ్యంలో 38 పార్టీలతో కూడిన ఎన్డీఏ మెగా భేటీ ఆరంభమైంది. భేటీ హాజరైన నేతలను ప్రధాని మోదీ పలకరించారు. ఈ సందర్భంగా పార్టీల నేతలందా గజమాలను ప్రధాని మెడలో వేశారు. అనంతరం భేటీ మొదలైంది.
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఒకే వేదికపైకి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు తమ నూతన కూటమికి ‘ఇండియా’ అనే పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. I - ఇండియా, N - నేషనల్, D - డెమొక్రాటిక్, I - ఇంక్లూజివ్, A - అలయెన్స్ (INDIA)గా వర్ణించాయి.
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. బెంగళూరులో సమావేశమైన పార్టీలకు ఒకే ఒక మంత్రం ఉందని, అది.. కుటుంబం యొక్క, కుటుంబం ద్వారా, కుటుంబం కోసం అని వివరించారు. అందుకే ప్రజలు 2024లో మళ్లీ ఎన్డీయేను అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్నారన్నారు.
లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కలిసి వచ్చే పార్టీలతో సమాలోచనలు ప్రారంభించాయి. ప్రతిపక్షాలు ఈ ప్రయత్నాలను గత నెల నుంచి ముమ్మరం చేయగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తాజాగా రంగంలోకి దిగింది. జాతీయవాదాన్ని వినిపించే బీజేపీని దీటుగా ఎదుర్కొనడం కోసం ప్రతిపక్షాలు తమ కూటమికి ‘దేశభక్తి’ని జోడించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అవును.. మీరు వింటున్నది నిజమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఢిల్లీ (Delhi) వేదికగా కీలక ప్రకటన చేయబోతున్నారు. పవన్ ప్రకటన ఏమై ఉంటుందా..? అని తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States Politics) సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఎవరూ ఊహించని రీతిలో ప్రకటన ఉండొచ్చని జనసేన (Janasena) వర్గాలు చెబుతున్నాయి...
ఎన్డీయే దేశానికి అందిస్తున్న సేవలు, దేశ పటిష్టత కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈనెల 18వ తేదీన ఏర్పాటు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న ఎన్‌డీఏ సమావేశంలో 38 పార్టీలు పాల్గొంటున్నట్టు చెప్పాయని తెలిపారు. యూపీఏ కూటమికి ఒక నేత కానీ, నిర్ణయాలు తీసుకునే అధికారం కానీ లేదని అన్నారు.
దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. నేడు, రేపు పోటాపోటీగా అధికార విపక్షాల కూటమి సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు, రేపు బెంగళూరులో విపక్షాలు భేటీ అవుతుండగా, రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. ఇవి రెండూ కీలక సమావేశాలే కావడం గమనార్హం.
జూలై-18న ఎన్డీయే (NDA) కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి టీడీపీ (TDP) హాజరవుతోంది. ఇప్పుడీ వార్త జాతీయ మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రముఖ చానెళ్లలో ప్రధాన వార్తగా నిలిచింది. గతంలో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య అంతగా సత్సంబంధాలు నడవలేదు..