Home » Neeraj Chopra
పారిస్ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతున్నా..అథ్లెటిక్స్‌కు ఉండే క్రేజే వేరు. గతంలో ఈ విభాగానికి సంబంధించి భారత్‌కు పెద్దగా చెప్పుకోవాల్సింది ఉండేది కాదు. కానీ టోక్యో విశ్వ క్రీడల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా చారిత్రక స్వర్ణ పతకం కొల్లగొట్టడంతో ప్రపంచ అథ్లెటిక్స్ దృష్టి ఒక్కసారిగా భారత్‌పై నిలిచింది.
చెక్ రిపబ్లిక్లో మంగళవారం జరగనున్న ఓస్ట్రవా గోల్డెన్ స్పైక్ మీట్ నుంచి ఒలింపిక్ చాంప్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వైదొలిగాడు. అయితే, గాయం కారణంగానే నీరజ్ ఈ ఈవెంట్‌కు
భారత స్టార్ క్రీడాకారుడు, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) గాయపడ్డాడు. పారిస్ ఒలింపిక్స్ 2024 మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలోనే అతనికి గాయమైంది. ప్రపంచ ఛాంపియన్ నీరజ్ చోప్రా కొన్ని వారాల క్రితం శిక్షణ సమయంలో కండరాల గాయంతో బాధపడ్డాడు.
ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా దోహా డైమండ్ లీగ్‌లో త్రుటిలో స్వర్ణ పతకాన్ని మిస్సయ్యాడు. శుక్రవారం రాత్రి జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్
Jasprit Bumrah: గాయం కారణంగా 11 నెలలపాటు టీమిండియాకు దూరంగా ఉన్న పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ద్వారా పునరాగమనం చేసిన బుమ్రా సత్తా చాటుతున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లోనూ బుమ్రా చెలరేగాడు.
భారతదేశానికి బంగారు పతకాన్ని అందించిన నీరజ్ చోప్రా అదే రోజున మరొక సంఘటన ద్వారా దేశ ప్రజల మనసు దోచేశాడు.
చైనాలోని హాంగ్జౌ(Hangzhou) వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో - 2023(Asian Games - 2023) ఇండియన్ క్రీడాకారులు.. సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు దేశం తరఫున సాధించిన పతకాల సంఖ్య 80కి చేరుకుంది.
క్రికెట్(Cricket) దేశంగా పేరొందిన భారత్(India)లో మిగతా క్రీడలకు ఆదరణ కరవు అనేది నిన్నటి మాట. కపిల్ డెవిల్స్(Kapil Devils) వరల్డ్‌కప్ విక్టరీ దేశంలో క్రికెట్ విప్లవానికి ఎలా నాంది పలికిందో.. అంతర్జాతీయ వేదికలపై బల్లెం వీరుడు నీరజ్ చోప్రా(Neeraj Chopra) వరుస విజయాల ప్రభావం భవిష్యత్ తరంపై అలాంటి ముద్ర వేస్తోంది.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరు ముగిసిన తర్వాత కాంస్యం నెగ్గిన చెక్ రిపబ్లిక్ అథ్లెట్ వాద్లెచ్‌తో కలిసి నీరజ్ చోప్రా ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ సందర్భంగా అతడు చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంది. 87.82 మీటర్ల దూరం విసిరి రజతం నెగ్గిన పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ను కూడా ఫోటో దిగేందుకు నీరజ్ చోప్రా పిలిచాడు. అయితే అక్కడే ఉన్న నదీమ్.. తన దేశం జెండా కూడా పట్టుకోకుండానే నీరజ్ పక్కన నిలబడ్డాడు. వెనుకాల మువ్వన్నెల జెండాను పట్టుకుని నదీమ్‌ను ఆప్యాయంగా పిలిచినందుకు నెటిజన్లు నీరజ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత ఆశాకిరణ నీరజ్ చోప్రా స్వర్ణ చరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించాడు. పోటీలకు చివరిరోజైన ఆదివారం రాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ రెండో ప్రయత్నంలో గరిష్ఠంగా 88.17 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.