Home » New Delhi
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. న్యూఢిల్లీ నుంచి భోపాల్ వరకు ఆయన తన భార్యతో కలిసి ఈ రైలులో ప్రయాణించారు. ఈ సందర్బంగా ఆయన ప్రయాణికులతో మాటలు కలిపారు.
కొత్త క్రిమినల్ చట్టాలైన 'భారతీయ న్యాయ్ సంహిత', 'భారతీయ సురక్షా సంహిత', 'భారతీయ సాక్ష్య అభినయం' ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా) అర్జున్ మేఘ్వాల్ ఆదివారంనాడు తెలిపారు.
ఢిల్లీ మాజీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆయన అసెంబ్లీ సభ్యత్వంపై 'అనర్హత' వేటు వేసినట్టు స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ శుక్రవారంనాడు తెలిపారు. 'ఆప్' సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖతో సహా పలు శాఖలను ఆనంద్ గతంలో నిర్వహించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బుధవారంనాడు బాధ్యతలు చేపట్టారు. మోదీ మంత్రివర్గంలో వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కారు. కేంద్ర మంత్రివర్గంలో వరుసగా మూడోసారి చోటు దక్కించుకున్న మహిళగా కూడా నిలిచారు.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. జూన్ 9వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు న్యూఢిల్లీలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ.. ఆసియాలో తొలి మహిళ లోకో పైలెట్ సురేఖ యాదవ్‌ను ఆహ్వానం అందింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) కూటమి గెలిచిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు, నేతలపై వైసీపీ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) తీవ్రంగా స్పందించారు..
కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ పేరుకు మద్దతు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. నరేంద్ర మోదీ ఇంట్లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినలో పర్యటించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకునే వరకూ అందరి చూపు.. చంద్రబాబుపైనే..
అవును.. నాడు వద్దునుకున్నారు.. కనీసం కలుస్తామంటే అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు..! రండి కలుద్దామని చెప్పి వద్దన్న సందర్భాలూ ఉన్నాయ్..! మీతో పనేముంది జీరో కదా అన్నట్లుగా చూసిన పరిస్థితి..! ఐదంటే ఐదేళ్లు.. సీన్ కట్ చేస్తే అదే జీరో, హీరోగా మారారు..! దీంతో రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఆయనవైపే చూస్తోంది..!
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. దీంతో న్యూఢిల్లీలోని ప్రదాని మోదీ నివాసంలో బుధవారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పుతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.