Share News

Champai Soren: చెప్పిందే చెప్పిన చంపయీ.. కొనసాగుతున్న మిస్టరీ

ABN , Publish Date - Aug 18 , 2024 | 02:35 PM

జార్ఖండ్‌లో కాకలు తిరిగిన గిరిజన నేతగా పేరున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ హస్తినలో ఆదివారంనాడు అడుగుపెట్టడం వెనుక కారణం ఏమిటనే సస్పెన్స్ కొనసాగుతోంది.మీడియా అడిగిన రెండు ప్రధాన ప్రశ్నలకు సూటి సమాధానం దాటవేశారు.

Champai Soren: చెప్పిందే చెప్పిన చంపయీ.. కొనసాగుతున్న మిస్టరీ

న్యూఢిల్లీ: జార్ఖండ్‌ (Jharkhand) లో కాకలు తిరిగిన గిరిజన నేతగా పేరున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ (Champai Soren) హస్తినలో ఆదివారంనాడు అడుగుపెట్టడం వెనుక కారణం ఏమిటనే సస్పెన్స్ కొనసాగుతోంది. జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీలో ఆయన చేరనున్నారంటూ రెండ్రోజులుగా ప్రచారం జరుగుతుండగా, ఆ వదంతుల గురించి తనకు తెలియదని, తాను ఎక్కడున్నాడో అక్కడే ఉన్నానని కొద్ది గంటల క్రితమే చెప్పిన చంపయీ హస్తినలో అడుగుపెట్టగానే మీడియాకు సైతం ఇదే చిత్రమైన సమాధానం ఇచ్చారు. మీడియా అడిగిన రెండు ప్రధాన ప్రశ్నలకు సూటి సమాధానం దాటవేశారు.

Jharkhand: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. హస్తినలో చంపయీ సోరెన్


ఢిల్లీ రాకకు కారణం ఏమిటని మీడియా అడిగిన తొలి ప్రశ్నకు వ్యక్తిగత కారణాలతోనే వచ్చానని, తన కుమార్తెను కలుసుకోనున్నానని చంపయీ సమాధానమిచ్చారు. బీజేపీలో చేరిక గురించి అడిగినప్పుడు సమాధానం దాటవేశారు. ప్రస్తుతం తానెక్కడున్నానో అక్కడే ఉన్నానని మాత్రమే చెప్పారు. జేఎంఎం పట్ల అసంతృప్తితో ఉన్నారా అని మీడియా గుచ్చిగుచ్చి అడిగినప్పుడు కూడా ఆయన సూటిసమాధానం ఇవ్వలేదు. దానిపై (జేఎంఎం) ఇప్పటికిప్పుడు ఏమీ సమాధానం చెప్పలేనన్నారు. కాగా, బీజేపీ నేత సువేందు అధికారిని కోల్‌కతాలో శనివారంనాడు చంపయీ కలిసినట్టు వచ్చిన వార్తలను కూడా ఆయన తోసిపుచ్చారు. తానెవరినీ కలవలేదంటూ తెగేసిచెప్పారు. బీజేపీ నేతలతో తరచు సంప్రదింపులు సాగిస్తున్న జేఎంఎం మాజీ ఎమ్మెల్యే లాబిన్ హెమ్‌బ్రోమ్‌‌తో సమావేశంపై అడిగనప్పుడు, ఇది రొటీన్ వ్యవహారమేనని కొట్టివేశారు. ఆయనే తనను కలిసారని, మామూలుగానే తాము సంభాషించుకున్నామని చెప్పారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 18 , 2024 | 02:35 PM