Supreme Court: బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ABN , Publish Date - Sep 02 , 2024 | 06:39 PM
'బుల్డోజర్ న్యాయం' పై సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ తెలిపింది. ఒక కేసులో నిందితులైనంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించింది.
న్యూఢిల్లీ: 'బుల్డోజర్ న్యాయం' (bulldozer justice)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ తెలిపింది. ఒక కేసులో నిందితులైనంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిపై బుల్డోజర్లను పంపిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచు చోటుచేసుకుటున్నాయి. బుల్డోజర్ న్యాయాన్ని అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరుపుతూ, ఒక వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఆ కారణం చూపించి కూల్చివేతలను ఎలా చేపడతారని ప్రశ్నించింది. ఒకవేళ ఆ వ్యక్తి దోషిగా తెలినప్పటికీ చట్టం సూచించిన విధానాన్ని అనుసరించకుండా అతని ఆస్తిని కూల్చివేయకూడదని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
Swati Maliwal assault case: బిభవ్ కుమార్‌కు సుప్రీం బెయిల్
ప్రజా రవాణా, రహదారులకు అడ్డంకిగా మారే అక్రమ కట్టడాలను తాము రక్షించడం లేదని కూడా ధర్మాసనం తెలిపింది. కూల్చివేతలకు సంబంధించి పాన్-ఇంండియా బేసిసిలో మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉందని పేర్కొంది. దీనిపై ఇరు పక్షాలు తమ సూచనలు తెలియజేయవచ్చని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.
Read More National News and Latest Telugu New