Home » New York
క్రికెట్ క్రీడాభిమానలకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇటివల ఐపీఎల్ 2024 ముగియగా, ఇప్పుడు మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) మొదలు కానుంది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో జరగనుంది. తక్కువ సమయం ఉన్న క్రమంలో టీమ్ ఇండియా అమెరికా చేరుకున్న తర్వాత సన్నాహాలను ప్రారంభించింది.
‘మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ)’ టెక్నాలజీపై విస్తృతంగా పరిశోధనలు చేసి 150కి పైగా పీర్ రివ్యూడ్ పరిశోధన పత్రాలు రాసి, 13 పేటెంట్లు పొందిన మన తెలుగువాడు.. డాక్టర్ గుళ్లపల్లి పూర్ణచంద్రరావు. బ్రెయిన్ ఇమేజింగ్ రిసెర్చ్ గతినే మార్చిన ప్రతిభావంతుడిగా పేరొందిన ఆయన.. ఆ పరిశోధనల క్రమంలోనే క్యాన్సర్ బారిన పడి గత ఏడాది కన్నుమూశారు.
అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి పాలస్తీనాకు అనుకూలంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థులను ఎట్టకేలకు బుధవారం తొలగించారు.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో.. కూలిన భవనాల శకలాలు, పేలని ఆయుధాలను తొలగించడానికి 14 ఏళ్ల సమయం పట్టవచ్చని ఐక్య రాజ్య సమితి(ఐరాస) అంచనా వేసింది.
పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా విద్యార్థుల ఆందోళనలతో అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా(america)లో ఇటివల అనేక మంది మొబైల్ వినియోగదారులకు టెలికాం సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో పలువురు సోషల్ మీడియాలో ఈ నెట్‌వర్క్‌పై సైబర్ దాడి జరిగిందని పోస్టులు చేశారు. దీనిపై కంపెనీ స్పందించి క్లారిటీ ఇచ్చింది.
అమెరికాలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో సబ్ వే వద్ద కాల్పులకు తెగబడ్డారు. న్యూయార్క్‌లో గల బ్రోంక్స్ సబ్ వే స్టేషన్ వద్ద సోమవారం ఓ ఆగంతకుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరపడంతో ఒకరు చనిపోయారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం విదేశాల్లో ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్దకు ప్రవాస భారతీయులు భారీగా చేరుకున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖమెరుగదు.. అన్న సామెతకు నిదర్శనంగా అప్పుడప్పుడూ మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తీవ్రమైన ఆకలి వేసినప్పుడు రుచితో సంబంధం లేకుండా ఏదోటి తినాలని అనుకుంటాం. అలాగే..
గుజరాత్ ప్రముఖ గర్బా నృత్యానికి(Garba Dance) యునెస్కో గుర్తింపు లభించిన విషయం విదితమే. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహించే గర్బాను ఈ జాబితాలో చేర్చాలంటూ భారత్ గతంలో నామినేట్ చేసింది.