Share News

PM Modi: భారత్‌ను ఆపడం ఎవరితరం కాదు..

ABN , Publish Date - Sep 23 , 2024 | 03:07 AM

మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌ను ఆపడం ఎవరితరం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

PM Modi: భారత్‌ను ఆపడం ఎవరితరం కాదు..

  • నా ముందు మహోన్నత లక్ష్యాలున్నాయి

  • ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ ‘పుష్ప’కు ప్రధాని కొత్త నిర్వచనం

న్యూయార్క్‌, సెప్టెంబరు 22: మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌ను ఆపడం ఎవరితరం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మూడో సారి ప్రధానిగా ఎన్నికైన తన ముందు మహోన్నత లక్ష్యాలున్నాయని వివరించారు. ఆదివారం ఆయన న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ‘మోదీ- యూఎస్‌- ప్రోగ్రెస్‌ టుగెదర్‌’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 15 వేల మంది భారతీయులు పాల్గొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ పుష్ప-1లోని ‘శ్రీవల్లి’ పాటతో ఆహూతులను ఉర్రూతలూగించగా.. ఆయన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పాటను ఆలపిస్తుండగా.. ప్రధాని మోదీ వేదికపైకి చేరుకున్నారు. మోదీ కూడా పుష్ప గురించి మాట్లాడారు.


‘‘పుష్ప అంటే.. ప్రోగ్రెసివ్‌ భారత్‌.. అన్‌స్టాపబుల్‌ భారత్‌, స్పిరిచ్యువల్‌ భారత్‌, డెడికేటెడ్‌ భారత్‌, హ్యుమానిటీ ఫస్ట్‌ భారత్‌, ప్రాస్పరస్‌ భారత్‌’’ అని వివరించారు. ప్రవాస భారతీయులను భారత్‌కు బలమైన అంబాసిడర్లుగా అభివర్ణించారు. ‘‘నా జీవితంలో నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానని ఊహించలేదు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపడతానని అనుకోలేదు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన నా ముందు మహోన్నతమైన లక్ష్యాలున్నాయి. మూడో ఆర్థిక శక్తిగా భారత్‌ను తయారు చేస్తాం. 5జీ టెక్నాలజీలో అమెరికా కంటే ఎక్కువ నెట్‌వర్క్‌ను కవర్‌ చేస్తున్నాం’’ అని వివరించారు. కాగా.. సోమవారం ఐక్య రాజ్య సమితి(ఐరాస) సర్వసభ్య సమావేశంలో ‘సమ్మిట్‌ ఆఫ్‌ ద ఫ్యూచర్‌’ అనే అంశంపై మోదీ ప్రసంగించనున్నారు.

Updated Date - Sep 23 , 2024 | 03:08 AM