Home » Nimmala Rama Naidu
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ తన విధ్వంసకర పాలనకు ప్రజావేదిక కూల్చివేతతో శ్రీకారం చుట్టారని అన్నారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని లేకపోయినా ప్రతీ ఒక్కరిపై రూ. 2.50 లక్షల అప్పు ఉందని అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాల సాక్ష్యాలను తెరమగురు చేసే ప్రయత్నం ప్రతి శాఖలోనూ జరుగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు.
పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి పోలవరాన్ని గోదావరిలో ముంచేసిన వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: తుంగభద్ర డ్యామ్ దగ్గర 19వ తాత్కాలిక గేటు బిగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండు, మూడవ ఎలిమెంట్లు ఇంజనీర్లు అమర్చుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ 60x4 మొదటి బిట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసిన నిపుణుల శ్రమ ఫలించిందన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘ అన్న క్యాంటీన్’ను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసి వేశాడని ఆయన మండిపడ్డారు.
తుంగభద్రకు యుద్ధప్రాతిపదికన గేట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) తెలిపారు. వరద కొనసాగుతుండగానే గేట్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఆదేశాలతో తుంగభద్ర డ్యామ్ కొత్త గేటు ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆదివారం నాడు సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్‌కు సంబంధించి 19వ గేటు శనివారం రాత్రి కొట్టుకుపోయిందని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా కూడా ఉండటానికి అర్హత లేదని ప్రజలు జగన్‌కు ప్రజా తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఇప్పటికి ఆయన పద్ధతిలో మార్పు రావడం లేదని విమర్శించారు.
జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆరోపించారు. ఈ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో అత్యధిక శాతం కేటాయించిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారో రాష్ట్రాన్ని కూడా ప్రకృతి అదే విధంగా దీవిస్తోందని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఏపీలో జలకళ సంతరించుకుందని ఆయన చెప్పారు.