Share News

Minister Ramanaidu: మంత్రి రామానాయుడు శ్రమదానం

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:13 AM

డా. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మంత్రి రామానాయుడు చింతపర్రులో శ్రమదానం చేశారు. అంబేడ్కర్‌ స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు

Minister Ramanaidu: మంత్రి రామానాయుడు శ్రమదానం

పాలకొల్లు రూరల్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రు అరుంధతీ పేటలో సోమవారం జరిగిన అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అక్కడ జరుగుతున్న అంబేడ్కర్‌ విగ్రహ స్లాబ్‌ నిర్మాణ పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు.

Updated Date - Apr 15 , 2025 | 05:13 AM