Handriniva Canal Debate: హంద్రీనీవాపై వైసీపీ రచ్చ.. మంత్రి ధీటైన సమాధానం
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:11 PM
Handriniva Canal Debate: హంద్రీనీవా కాలువకు సంబంధించి వైసీపీ ఆరోపణలపై మంత్రి నిమ్మల రామానాయుడు ధీటైన సమాధానం ఇచ్చారు. హంద్రీనీవా ద్వారా రెట్టింపు జలాలు ప్రవహించేలా సీఎం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

అమరావతి, మార్చి 19: హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులు, ప్రవాహం పెంచడంపై శాసన మండలిలో వాడీవేడీ చర్చ జరిగింది. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు చేయడాన్ని ఆపాలని వైసీపీ సభ్యుడు శివరామిరెడ్డి కోరారు. లైనింగ్ చేస్తే భూగర్భజలాలు పెరగవని, ప్రవాహం పెంచే అవకాశం ఉందన్న సభ్యుడు తెలిపారు. హంద్రీనీవా ప్రవాహాన్ని పదివేల క్యూసెక్కులకు పెంచాలని శివరామిరెడ్డి కోరారు. అయితే హంద్రీనీవాపై వైసీపీ సభ్యులు అవాస్తవాలు చెప్పి సభను తప్పుదో పట్టిస్తున్నారన్న ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ (Minister Payyavula Keshav) ఫైర్ అయ్యారు. హంద్రీనీవా ఎన్టీఆర్ కృషి ఫలితమని, ఒక రోజైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు.
ఇక... వైసీపీ సభ్యుల ఆరోపణలకు జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ధీటుగా సమాధానం చెప్పారు. హంద్రీనీవా ద్వారా 2025 జూన్ కల్లా రెట్టింపు జలాలు ప్రవహించేలా సీఎం చర్యలు తీసుకున్నారన్నారు. హంద్రీనీవా ప్రవాహాన్ని 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కులకు పెంచాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) నిర్ణయించారని తెలిపారు. ఏ ప్రాజెక్టుకూ కేటాయించని రీతిలో బడ్జెట్‌లో రూ.3240 కోట్లు హంద్రీనీవాకు కూటమి ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. ప్రవాహం పెంచి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాలకు నీటిని అదనంగా తరలిస్తామన్నారు. హంద్రీనీవా కాలువ 216 నుంచి 400 కిలోమీటర్ల వరకు 195 చెరువులు అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.
Legislative Council Controversy: మమ్మల్ని అవమానిస్తున్నారన్న బొత్స.. మంత్రుల సమాధానం ఇదీ
బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటి ప్రవాహాన్ని తెచ్చిన తర్వాత రాయలసీమకు మరిన్ని నీళ్లు అందిస్తామన్నారు. భవిష్యత్తులో హంద్రీనీవా ద్వారా నీటి ప్రవాహాన్నిదశలవారీగా గణనీయంగా పెంచాలని సీఎం నిర్ణయించారని చెప్పారు. హంద్రీనీవా కాలువ లైనింగ్ వద్దని చెబుతోన్న వైసీపీ సభ్యులు... గతంలో జగన్ ఆదేశాలిచ్చినపుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో ఒక్క క్యూసెక్కు ప్రవాహాన్నీ ఎందుకు పెంచలేదని మంత్రి నిలదీశారు. గత ఐదేళ్లలో హంద్రీనీవా పనులను రూపాయి కూడా ఎందుకు ఖర్చు చేయాలని అడిగారు. ప్రవాహం పెంచేందుకు చంద్రబాబు మల్యాల వద్ద మోటార్లు పెడితే జగన్ హయాంలో ఎందుకు వినియోగించుకోలేదంటూ ఫైర్ అయ్యారు. ఓ వైసీపీ నేత కుప్పం నుంచి చిత్తూరుకు పైపుల ద్వారా నీరు తీసుకువెళ్తుంటే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని అడిగారు. హంద్రీనీవా కెనాల్‌ను లైనింగ్ చేస్తే .. రాయలసీమ సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
Marri Rajasekhar Resigns: మర్రి రాజశేఖర్‌కు బుజ్జగింపులు.. ఇదే ఫైనల్ అన్న ఎమ్మెల్సీ
Hyderabad: హలో నాగమణి.. అమ్మాయి కావాలి
Read Latest AP News And Telugu News