Home » Nirmal
నిర్మల్ జిల్లా: అభివృద్ధి విషయంలో తాము చెప్పేది అబద్ధమైతే ఓట్లు వేయొద్దని.. ప్రధాని మోదీ గాలి మోటార్లో వచ్చి.. గాలి మాటలు చెప్పి వెళ్లి పోయారుని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ పొందిన జాన్సన్ నాయక్పై దుమారం మొదలైంది. జాన్సన్ నాయక్ లంబాడా తెగకు చెందిన వాడు కాదని ఆయన తాత, ముత్తాతలు, తల్లిదండ్రులు క్రైస్తవ మతంలో కొనసాగుతున్నారంటూ ఆరోపణలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను చేసింది ఎవరో కాదు స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
నేడు నిర్మల్(Nirmal) పర్యటనకు వచ్చిన సీనియర్ నేత డీకే అరుణ(DK Aruna)ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
నిర్మల్: టౌన్ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అలజడి రేగింది. ప్లాన్ రద్దు కోసం ఐదు రోజులుగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
నిర్మల్లో మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలో చిరుతపులి(Leopard) సంచరించింది. చిరుత కదలికలతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
నిర్మల్ జిల్లా: సీఎం కేసీఆర్ నిర్లక్ష్య ధోరణి, అనాలోచిత నిర్ణయాలతోనే రాష్ట్రంలో చిన్నపాటి వర్షాలకే వరదలు వస్తున్నాయని, వరదల కారణంగా పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో పంటలకు పనికి రాకుండా పోయాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
నిర్మల్(Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టు(Kadem project)కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాజెక్టు కింది గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీపిక రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న వార్త మరువక ముందే తాజాగా మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. బూర లిఖిత అనే విద్యార్థిని గత అర్ధరాత్రి హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
తెలంగాణ రాజకీయాలు (TS Politics) శరవేగంగా మారిపోతున్నాయ్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతల జంపింగ్లు ఎక్కువయ్యాయి. ఏ పార్టీలో అయితే తమకు ప్రాధాన్యత ఉంటుందో.. ఎక్కడైతే టికెట్ దక్కే ఛాన్స్ ఉంటుందో అని లెక్కలేసుకుని కండువాలు మార్చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి వెళ్తున్నారంటే ఓ లెక్కంటుంది.. కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తుండటంతో బీఆర్ఎస్లో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొందని అధిష్టానం తలలు పట్టుకుంటోందట.