Home » Nitish Kumar
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా బ్లాక్లో తొలి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కూటమిలో కీలక బాధ్యతలను బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమర్ కు అప్పగించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆసక్తికరంగా కొద్ది రోజుల క్రితం వరకూ కూటమి తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత ఆస్తుల విషయంలో తన డిప్యూటీ తేజస్వి యాదవ్ కంటే వెనుకబడ్డారు. ప్రతి సంవత్సరం చివరిరోజున సీఎం సహా కేబినెట్ మంత్రులంతా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించడం తప్పనిసరి. ఆ ప్రకారం సీఎం తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వద్ద రూ.22,552 నగదు ఉండగా, రూ.49,202 బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.
జనతాదళ్ యునైటెడ్ అధ్యక్ష పగ్గాలను తిరిగి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన చేతుల్లోకి తీసుకున్నారు. బీహార్ అధికార జేడీయూ అధ్యక్షుడిగా నితీష్ శుక్రవారంనాడిక్కడ జరిగిన పార్టీ జాతీయ ఎక్సిక్యూటివ్ సమాశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతవరకూ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లలన్ సింగ్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టారు.
‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న ఎప్పటినుంచో మిస్టరీగానే ఉంది. అయితే.. ఇటీవల జరిగిన ఇండియా కూటమి నాల్గవ సమావేశంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ ప్రతిపాదన...
బీహార్లోని అధికార పార్టీ జనతా దళ్-యునైటెడ్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్ష పదవికి లలన్ సింగ్ మంగళవారంనాడు రాజీనామా చేశారు. జేడీయూలో కీలక వ్యక్తిగా పేరున్న లలన్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు పంపినట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును కొందరు నేతలు ఇటీవల ప్రతిపాదించడంపై కూటమిలో చీలక ఏర్పడవచ్చనే ఊహాగానాలను బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ తెరదించే ప్రయత్నం చేశారు. కూటమిలో పోస్ట్ కోసం తాను ఎలాంటి ఆసక్తి వ్యక్తం చేయలేదని, తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు.
వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాలు చేసే పొలిటికల్ సూపర్స్టార్ల జాబితాను విపక్ష ఇండియా కూటమి పరిశీలిస్తోంది. సీట్ల షేరింగ్ వ్యవహారంపై ఇండియా కూటమి మంగళవారం సమావేశమైన మరుసటి రోజే ఈ జాబితాపై కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. నితీష్ కుమార్, ప్రియాంక గాంధీ వాద్రా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
తమ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలని సుదీర్ఘకాలం నుంచి తాను చేస్తున్న డిమాండ్ని సీఎం నితీశ్ కుమార్ మరోసారి లేవనెత్తారు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన తూర్పు జోనల్ కౌన్సిల్ 26వ సమావేశంలో...
ప్రతిపక్ష ఇండియా కూటమి(INDIA Alliance) ఏర్పాటు చేసే మీటింగ్ కి తాను హాజరుకావట్లేదంటూ వస్తున్న వదంతులను బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఖండించారు.
డిసెంబర్ 6న జరిగే ఇండియా కూటమి సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో వీరిద్దరు పాల్గొనకపోవచ్చు.