Home » Nizamababad
దళారుల మాటలు నమ్మి 30 రోజుల విజిట్ వీసాపై సౌదీ అరేబియాకు వచ్చిన తెలంగాణ వాసి నాలుగున్నరేళ్లు ఇక్కడే ఉన్నాడు. అనారోగ్య కారణాలతో మరణించిన అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
కోల్‌కతా ఆర్జీ కార్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రంలోని వైద్య సంఘాలు శనివారం భారీఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకు అందలేదని పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలకు దిగారు. రోడ్లపై బైఠాయించి.. పురుగు మందు చేతపట్టి నిరసనలు చేపట్టారు.
లింగంపేట్ మండలం పోల్కంపేట్(Polkampet) గ్రామ పంచాయతీ పరిధిలో పశువుల కాపరిపై ఎలుగుబంటి(Bear) దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
Telangana: నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. పిల్లలకు అందుతున్నకాస్మొటిక్ చార్జెస్, పౌష్టికాహారం, ఆడిట్ వివరాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలాజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, పే అండ్ అకౌంట్స్ శాఖల అధికారులు సోదాలు నిర్వహించారు.
Telangana: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్‌ను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఈరోజు కోర్టుకు సెలవు కావడంతో మెహదీపట్నంలోని జడ్జి ఇంట్లో నరేందర్‌ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జడ్జి ముందుకు నరేందర్‌ను తీసుకెళ్లనున్నారు.
నగరపాలక సంస్థ సూపరింటెండెంట్, ఇన్‌ఛార్జి రెవెన్యూ అధికారి నరేందర్‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుడు నరేందర్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు అధికారులు తరలించారు. అనంతరం ఇవాళ అతని బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు.
నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాదాపు రూ.3కోట్ల నగదు(2,93,81,000)ను స్వాధీనం చేసుకున్నారు.
జక్రాన్‌పల్లి(Jakranpally) మండలం అర్గుల్(Argul) గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడం, అప్పులబాధతో యువరైతు రాజేశ్(Farmer Rajesh) ఆత్మహత్య చేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ... అర్హులైన తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని ఆయా ప్రాంతాల రైతులు సోమవారం బ్యాంకుల ముందు ఆందోళనకు దిగారు.