MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:51 PM
ఏప్రిల్ 27న వరంగల్‍లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రాకుండా తమ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహించారు. అలాంటి కాంగ్రెస్ నేతలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

కామారెడ్డి: బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను బెదిరించే కాంగ్రెస్ నేతల పేర్లను పింక్ బుక్(Pink Book)లో నమోదు చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) హెచ్చరించారు. ఈనెల 27న వరంగల్(Warangal)లో జరగనున్న బీఆర్ఎస్(BRS) రజతోత్సవ సభకు కార్యకర్తలు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని కవిత మండిపడ్డారు. తమ కార్యకర్తలకు ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారని, వారందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.."బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు. నేను కేసీఆర్ లాగా కాదు.. నేను రౌడీ టైపు. మా నేతలను బెదిరించే అధికారులను, కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అలాంటి వారి పేర్లు పింక్ బుక్‌లో నమోదు చేస్తా. మా పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చింది. అందుకే వరంగల్ రజతోత్సవ వేడుక తెలంగాణ కుంభ మేళా అవుతుంది. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పాలన కోరుకుంటున్నారు. బాన్సువాడలో ఉపఎన్నిక వస్తే గులాబీ జెండా ఎగరడం ఖాయం. 15 నెలల్లో ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబెల్ బహుమతి ఇవ్వాలి. కాంగ్రెస్ పాలన అంటేనే మాటల ప్రభుత్వం అనేది తేలిపోయింది. డబ్బుల కోసమే కొంతమంది నాయకులు ఆ పార్టీకి వలస వెళ్లారని" అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..
AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..
Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..