Home » Nominations
Andhrapradesh: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవగా.. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలయ్య, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఇలా ప్రముఖులు సహా అనేక మంది నామినేషన్లు వేసేశారు. ఈరోజు (సోమవారం) తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గా గద్దె రామ్మోహన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
లోక్ సభ ఎన్నికలు - 2024కు ( Lok Sabha Elections - 2024 ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో తనకు ఎంత ఆస్తి ఉందో వెల్లడించారు.
Andhrapradesh: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నిన్నటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవగా ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు మరికొంతమంది నామినేషన్ వేశారు. విజయవాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా కేశినేని చిన్ని మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహంతో కేశినేని చిన్ని ర్యాలీ కోలాహలంగా సాగింది. ర్యాలీ కేశినేని నాని కార్యాలయం వద్దకు రాగానే...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ పత్రాలను ఆయన స్వయంగా కాకుండా.. సతీమణి నారా భువనేశ్వరితో (Nara Bhuvaneshwari) నామినేషన్ దాఖలు చేయిస్తున్నారు. మధ్యాహ్నం 01:27 గంటలకు రిటర్నింగ్ అధికారికి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆస్థానానికి గానూ పవన్ ఏప్రిల్ 23న నామినేషన్(Nomination) సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
Andhrapradesh: మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలైంది. గురువారం మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయంలో యువనేత తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియాకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను నేతలు అందజేశారు. టీడీపీ సమన్వయ కర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయ కర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ నేతృత్వంలో ....
Andhrapradesh: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా పశ్చిమ తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని సుజనా.. రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేడు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను’’ అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో.. ఇలా నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, కూటమి అభ్యర్థులు పలువురు తొలి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల కోలాహలం.. భారీ ర్యాలీల మధ్య నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉండటంతో వారి తరఫున కుటుంబ సభ్యులు కూడా పలుచోట్ల నామినేషన్లు వేయడం జరిగింది. తొలిరోజు, ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో సుమారు 20 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారని తెలుస్తోంది. అయితే.. అందరికంటే ముందుగా..
Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. దీంతో పలువురు అభ్యర్థులు ఈరోజు నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటు కుప్పం బాటలోనే మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్ వెళ్లనున్నారు. లోకేష్ తరపున స్థానిక నేతలు నామినేషన్ వేయనున్నాను. లోకేష్ నామినేషన్‌తో మంగళగిరిలో సందడి వాతావరణం నెలకొంది.
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు పలు చోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నేతలు, అధికార గణం అండదండలతో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.