Gadde Rammohan: విజయవాడ ఈస్ట్‌లో టీడీపీ జెండా ఎగరడం ఖాయం
ABN , Publish Date - Apr 22 , 2024 | 11:09 AM
Andhrapradesh: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవగా.. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలయ్య, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఇలా ప్రముఖులు సహా అనేక మంది నామినేషన్లు వేసేశారు. ఈరోజు (సోమవారం) తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గా గద్దె రామ్మోహన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
విజయవాడ, ఏప్రిల్ 22: ఏపీలో నామినేషన్ల (Nominations) పర్వం కొనసాగుతోంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవగా.. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu), లోకేష్ (Nara Lokesh), బాలయ్య (Balakrishna), ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) ఇలా ప్రముఖులు సహా అనేక మంది నామినేషన్లు వేసేశారు. ఈరోజు (సోమవారం) తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గా గద్దె రామ్మోహన్ (TDP Candidater Gadde Rammohan) నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కోసం పటమట లంక నుంచి వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. భారీ ర్యాలీగా వెళ్లి గద్దె రామ్మోహన్ నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే పటమట లంక నుంచి భారీ ర్యాలీ మొదలైంది.
TS Politics: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరికకు బ్రేక్
ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు...
ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గంలో మూడో సారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు, ప్రజల ఆదరాభిమానంతో హ్యాట్రిక్ విజయం సాధిస్తామన్నారు. కొంతమంది నాయకులు తమ వల్లే అభివృద్ధి జరిగిందంటూ జబ్బలు చరుచుకుంటున్నారని.. ఎవరేం చేశారో ప్రజలకు తెలుసన్నారు. అబద్దాలు ప్రచారం చేసేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గడిచిన ఐదేళ్లల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రచార అస్త్రాలుగా చేసుకుంటామన్నారు. జగన్ చేసిన మోసాలనును అంశాల వారీగా ప్రజలకు వివరిస్తామని తెలిపారు. జనసేన, బీజేపీ మద్దతుతో 50వేల మెజారిటీ సాధిస్తాననే నమ్మకం ఉందని గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
AP Elections: ఆఖరి నిమిషంలో అనూహ్య పరిణామం.. పాడేరు టికెట్ గిడ్డి ఈశ్వరికే ఎందుకు..!?
మరిన్ని ఏపీ వార్తల కోసం..