Share News

Loksabha Polls: వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ నామినేషన్

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:56 PM

Telangana: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు.

Loksabha Polls: వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ నామినేషన్

వరంగల్, ఏప్రిల్ 22 : బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ (Warangal BRS MP candidate Sudhir Kumar) నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakarrao) మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు. కేసీఆర్ వచ్చాకే తెలంగాణలో అభివృద్ధి జరిగిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ చరిత్ర చూసి ఓటు వేయాలని కోరారు. కడియం శ్రీహరి, ఆరూరి రమేష్ చరిత్ర కూడా పరిశీలన చేయాలన్నారు. రేపు కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయిలని కోరారు. కడియం కావ్య నాన్ లోకల్ అని.. గుంటూరు వ్యక్తిని పెళ్లిసేసుకోలేదా? అని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.

Raghunandan rao: నా గొంతుని కాపాడండి.. మోసపోయి మీరు ఆగం కావొద్దు


బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘నన్ను గెలిపిస్తే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడతాను. మామునూర్ ఎయిర్ పోర్ట్, కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ పూర్తి చేస్తాం. అనేక పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం. తెలంగాణ దళం, బలం ఉంటేనే ప్రశ్నించగలుగుతాం. కడియం శ్రీహరి, ఆరూరి రమేష్‌కు బుద్ధి చెప్పాలి’’ అని సుధీర్ కుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

AP SSC Results: పది ఫలితాల్లో ఎవరిది పైచేయి.. ఫస్ట్.. లాస్ట్ ఏ జిల్లా..?

Viral: వేసవికి తెలివితో చెక్.. వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఎలాంటి ట్రిక్కులను ఉపయోగిస్తున్నారో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 22 , 2024 | 03:19 PM