Home » Notice
మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం తమ ముందు హాజరు కావాలన్నారు. అడ్రస్ ప్రూప్‌లతోపాటు, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.
వారం రోజుల క్రితం వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల వన్‌టౌన్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 7న దువ్వాడతో కలసి తిరుమల వచ్చిన ఆమె మాడవీధుల్లో, పుష్కరిణి వద్ద వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. తాము సహజీవనంలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకుంటామని తిరుమలలో మాధురి వ్యక్తిగత విషయాలు మాట్లాడటం వివాదాస్పదమైంది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల మేళా కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7300 పోస్టులను భర్తీ చేసింది. మరో 6500 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
గణేష్ మండపాల నిర్వాహకులు ముందస్తుగా అనుమతి తీసుకుంటే ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపునకు ఇక ‘హైడ్రా’ ద్వారానే నోటీసులు జారీ చేయించనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే అభియోగంపై ప్రశ్నించేందుకు బీజేపీ నేత లాకెట్ ఛటర్జీకి కోల్‌కతా పోలీసులు ఆదివారంనాడు సమన్లు పంపారు.
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్టు కేంద్ర హోం శాఖ అమిత్‌షా రాజ్యసభలో చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ 'సభా హక్కుల నోటీసు'ను పెద్దల సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు.
కోకాపేటలో గత ప్రభుత్వం 11 ఎకరాలు కేటాయించిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ తన న్యాయవాది ద్వారా పోలీసులకు సమాధానం ఇచ్చారు. గురువారం పోలీసులు ఎదుట హాజరు కావాలన్న నోటీసులకు లాయర్ ద్వారా సమాధానం పంపారు. తాను అందుబాటులో లేనని విచారణకు హాజరు కాలేనని రాజ్ తరుణ్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విటర్(ఎక్స్) ఖాతాలో పెట్టిన ఓ పోస్టుపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు.