Share News

TDP Police: దివ్వెల మాధురి తిరుమల పొలీసుల నోటీసులు..

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:51 AM

వారం రోజుల క్రితం వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివా‌స్, అతని సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల వన్‌టౌన్‌ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 7న దువ్వాడతో కలసి తిరుమల వచ్చిన ఆమె మాడవీధుల్లో, పుష్కరిణి వద్ద వీడియోలు చేస్తూ హల్‌చల్‌ చేశారు. తాము సహజీవనంలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకుంటామని తిరుమలలో మాధురి వ్యక్తిగత విషయాలు మాట్లాడటం వివాదాస్పదమైంది.

TDP Police: దివ్వెల మాధురి తిరుమల పొలీసుల నోటీసులు..

తిరుమల: దివ్వెల మాధురికీ (Divvela Madhuri) తిరుమల పొలీసులు నోటీసులు‌ (Tirumala Police Notices) ఇచ్చారు. టీటీడీ విజిలేన్స్ అధికారులు (TTD Vigilance Officers) ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాధురిపై పోలీసులు కేసు (Case) నమోదు చేశారు. పవిత్రమైన తిరు మాఢ వీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేశారని ఆరోపించారు. దీంతో పోలీసులు BNS 292, 296, 300 సెక్షన్ 66 -200-2008 కింద కేసు నమోదు చేశారు. తిరుమల పొలీసులు శ్రీకాకుళం జిల్లా, టెక్కలి చేరుకొని మాధురికీ నోటీసులు జారీ చేశారు.


కాగా వారం రోజుల క్రితం వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివా‌స్, అతని సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల వన్‌టౌన్‌ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 7న దువ్వాడతో కలసి తిరుమల వచ్చిన ఆమె మాడవీధుల్లో, పుష్కరిణి వద్ద వీడియోలు చేస్తూ హల్‌చల్‌ చేశారు. తాము సహజీవనంలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకుంటామని తిరుమలలో మాధురి వ్యక్తిగత విషయాలు మాట్లాడటం వివాదాస్పదమైంది. టీటీడీ నియమ నిబంధనలు, సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించారని, సోషల్‌ మీడియాలో రీల్స్‌ కోసం వీడియోలు తీసుకుంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ శ్రీవారి ఆలయ విజిలెన్స్‌ ఏవీఎస్‌వో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సెక్షన్‌ 292, 296, 300 బీఎన్‌ఎ్‌స, 66(ఈ) యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.


వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ తోపాటు శ్రీవారి దర్శనానికి వచ్చిన యూట్యూబర్‌ మాధురి తిరుమల ఆలయ మాడవీధుల్లో హల్‌చల్‌ చేశారు. ఇద్దరు అసిస్టెంట్లను పెట్టుకుని మరీ వీడియోలు తీయించుకుంటూ సందడి చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉంటున్న విషయంలో మాధురి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో ఆమె సోమవారం దువ్వాడతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనానంతరం దువ్వాడ మహద్వారం నుంచి వెలుపలికి రాగా, మాధురి మాత్రం బయోమెట్రిక్‌ పక్కనే ఉన్న మార్గం నుంచి వెలుపలకు వచ్చారు. మీడియా ఆమెను గుర్తించి వీడియోలు తీయడం మొదలుపెట్టిన తర్వాత.. ఆమె దువ్వాడ పక్కకు వచ్చి నిలుచున్నారు. సాయంత్రం మరోసారి ఆలయం వద్దకు చేరుకుని శ్రీవారి వాహన సేవలు వెళ్లే.. మాడవీధుల్లో తిరుగుతూ వీడియోలు తీయించుకున్నారు. ఇక అర్చకులు, అధికారులకు తప్ప ఇతరులకు అనుమతిలేని పుష్కరిణి హారతి పాయింట్‌ వద్ద కూడా మాధురి వెళ్లి వీడియాలు రికార్డు చేయించుకున్నారు. దర్శనం అనంతరం దువ్వాడ శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనంతోపాటు బ్రహ్మోత్సవాల్లో ఉత్సవమూర్తిని చూద్దామని వచ్చామన్నారు. ప్రజలందరికీ శాంతి సౌకర్యాలు చేకూరాలని స్వామిని ప్రార్థించానని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్రూప్1 పరీక్షలకు లైన్ క్లియర్

అమరావతికి నిధులు వస్తున్నాయి..

టీటీడీ టిక్కెట్లను రూ. 65 వేలకు విక్రయించిన వైసీపీ ఎమ్మెల్సీ

నిండు గర్భిణిని.. ఐదు కిలోమీటర్ల డోలీ మోత..

20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్‌గా లంకా దినకర్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 20 , 2024 | 12:00 PM