Home » NRI Organizations
ఎన్నారైలకు సేవలు అందిస్తున్న 'స్వదేశం' సంస్థ సభ్యత్వం నమోదు ప్రారంభించింది. ఈ సభ్యత్వానికి సంబంధించిన డిజిటల్ ఐడీ కార్డులను అందించనుంది. దీంతో స్వదేశం సభ్యత్వం తీసుకున్న వారికి మరింత సులువుగా, వేగంగా తమ సర్వీసులు అందించడం వీలు అవుతుందని నిర్వాహకురాలు స్వాతి తెలిపారు.
అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక బ్లూ వ్యాలీ నార్త్ హై స్కూల్ (Blue Valley North High School) లో ఇటీవల దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
గతవారం జరిగిన 'తాకా' ఎన్నికల ఫలితాలలో ఈ క్రిందివారు రాబోయే రెండు సంవత్సరాల (2023-2025) కాలానికి కార్య నిర్వాహక కమిటీ, ధర్మకర్తల మండలిగా (బోర్డు ఆఫ్ ట్రస్టీలు) ఎన్నికయ్యారు.
భాషే రమ్యం .. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది.
చరిత్రలోనే మొట్టమొదటి సారిగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) వారు అగస్టా ఫ్లైట్ స్కూల్ వారి సౌజన్యంతో అక్టోబర్ 28, 29న స్థానిక చెరోకీ కౌంటీ ఎయిర్ పోర్ట్‌లో ‘డిస్కవరీ ఫ్లైట్’ నిర్వహించారు.
ఎడారి నాట తెలుగు ఇంజినీర్లకు మరింత గుర్తింపు రావాలనే లక్ష్యంతో ఖతర్ తెలుగు ఇంజినీర్స్ ఫోరం అవిర్భవించింది. భారతీయ ఎంబసీ అధ్వర్యంలోని ఐ.బి.పి.సి మార్గదర్శకన తెలుగు ఇంజినీర్స్ ఫోరం పని చేస్తుంది.
ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటపుడు కనీస నియమాలు పాటించకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనంటూ ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ నేతలు అభిప్రాయపడ్డారు. అసలు ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా, కేబినెట్ హోదా కలిగిన నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించడం దారుణమన్నారు. ఆధారాలు చూపకుండా అక్రమ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.
అట్లాంటాలో సెప్టెంబర్ 9న జరిగిన ఆటా బోర్డు సమావేశంలో భాగంగా వివిధ అమెరికా రాష్ట్రాల నుంచి విచ్చేసిన అధ్యక్ష బృంద సభ్యులు, ధర్మకర్తల మండలి, అడ్వైజరీ కమిటీ, సుమారు 100 మంది బోర్డు సభ్యులు, అడ్హాక్ టీం, ఇతర ఆటా సభ్యులు పాల్గొన్నారు.
కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. బుధవారం (6వ తేదీ) నుంచి దేశం విడిచి వెళ్లే ప్రవాసులు (Expats) బకాయి ఉన్న టెలిఫోన్ బిల్స్ చెల్లించడం తప్పనిసరి చేసింది.
తానా ద్వారా తెలుగురాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని 'తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి' వెల్లడించారు. ఎస్.వి.ఎస్ కళ్యాణమండపంలో పుట్టగుంట వీరభద్రరావు జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు 'తానా ఫౌండేషన్ ట్రస్టీ పుట్టగుంట సురేష్' 100 మంది మహిళలకు 100 కుట్టు మిషన్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా అందజేశారు.