Home » NRI
కెనడా ఫుడ్ బ్యాంక్స్ నుంచి ఆహార పదార్థాలు అందిస్తుంటారు. వాస్తవానికి అవసరం ఉన్న వారు, పేదల కోసం ఫుడ్ అందజేస్తుంటారు. కెనడా టీడీ బ్యాంక్‌లో డాటా సైంటిస్ట్‌గా మెహుల్ ప్రజాపతి జాబ్ చేస్తున్నాడు. అతను కెనడా ఫుడ్ బ్యాంక్స్‌లో లైన్లో నిల్చొని ఉచితంగా ఆహార పదార్థాలు తీసుకున్నాడు. ఆ ఫుడ్ చూపిస్తూ వీడియో తీశాడు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
భారీ వర్షాలు యూఏఈని(UAE) అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఈ వర్షాల(Heavy Rains) కారణంగా ప్రభావితమైన భారతీయుల(Indians) సహాయార్ధం దుబాయ్‌లోని(Dubai) భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ(BJP) వినూత్నతకు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా సైన్యాన్ని రంగంలోకి దింపిన బీజేపీ.. ఎన్ఆర్ఐల మద్దతు కూడగట్టేందుకు సిద్ధమవుతోంది.
75 ఏళ్ల చరిత్రలో కనివీని ఎరుగని విధంగా కురిసిన అకాల వర్షాలు.. దుబాయ్‌ను అతలాకుతలం చేశాయి. ఈ వరద బీభత్సానికి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. రాజన్నసిరిసిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన భాస్కర్ అనే ఓ ప్రవాసీయుడు.. జలప్రళయానికి భయపడి కారులోనే గుండె ఆగి చనిపోయాడు.
వలసల సంఖ్యను తగ్గించడానికి బ్రిటిష్ ప్రభుత్వం(british government) తీసుకున్న కీలక నిర్ణయం నిన్నటి నుంచి అమల్లోకి రాగా, ఇది భారతీయులపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. కుటుంబ వీసాపై ఈ దేశానికి రావాలనుకునే పౌరులకు(immigration standards) అవసరమైన కనీస ఆదాయాన్ని బ్రిటన్ 55 శాతం పెంచింది.
విరాళాల కోసం తెలుగుదేశం పార్టీ ఓ వెబ్ సైట్‌కు రూప కల్పన చేసింది. ఈ వెబ్‌సైట్‌ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. పార్టీ విరాళాల కోసం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. టీడీపీ ఫర్ ఆంధ్ర. కామ్ క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు సేకరిస్తారని ఆయన వివరించారు.
మూడు వారాల క్రితం అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ కథ విషాదాంతమైంది. అతడి మృతదేహాన్ని స్థానిక పోలీసు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. క్లీవ్‌ల్యాండ్‌లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులుమహ్మద్ అర్ఫాత్ చనిపోయినట్టుగా గుర్తించారని తెలిపింది.
తైవాన్‌లోని హ్సించు నగరంలో తెలుగు వారంతా కలిసి తైవాన్ తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమంలో సాంప్రదాయ ఉగాది పచ్చడితోపాటు నోరూరించే వంటకాలను నిర్వాహకులు అందించారు.
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా.. ఆదివారం నిర్వహించిన 66వ సాహిత్య సమావేశం ‘‘మన ప్రాచీన భారతీయ సాహిత్యం.. ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే కార్యక్రమం ఘనంగా, విజ్ఞానదాయకంగా జరిగింది.
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) వార్షికోత్సవాన్ని రక్తదాన శిబిరంతో ప్రారంభించాయి. టీపీఏడీ ఏర్పడినప్పటి నుంచి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. గత మూడేళ్ల నుంచి ఏడాదికి రెండుసార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది 13వ రక్తదాన శిబిరం అని నిర్వహకులు తెలిపారు.