Indian At Canada: కెనడాలో కొలువు కోల్పోయిన భారతీయుడు.. ఏం జరిగిందంటే..?
ABN , Publish Date - Apr 24 , 2024 | 03:05 PM
కెనడా ఫుడ్ బ్యాంక్స్ నుంచి ఆహార పదార్థాలు అందిస్తుంటారు. వాస్తవానికి అవసరం ఉన్న వారు, పేదల కోసం ఫుడ్ అందజేస్తుంటారు. కెనడా టీడీ బ్యాంక్‌లో డాటా సైంటిస్ట్‌గా మెహుల్ ప్రజాపతి జాబ్ చేస్తున్నాడు. అతను కెనడా ఫుడ్ బ్యాంక్స్‌లో లైన్‌లో నిల్చొని ఉచితంగా ఆహార పదార్థాలు తీసుకున్నాడు. ఆ ఫుడ్ చూపిస్తూ వీడియో తీశాడు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
విదేశాల్లో నియమ, నిబంధనలు వేరు. రూల్స్ స్ట్రిక్ట్‌గా ఫాలొ అవుతారు. ఏ మాత్రం తేడా వచ్చిందంటే చాలు ఉద్యోగం నుంచి తీసి వేస్తారు. మరికొందరిని జైలుకు పంపిన సందర్భాలు ఉన్నాయి. కెనడాలో ఓ భారతీయ ఉద్యోగి ఇలా ఇబ్బంది పడ్డారు.
ఏం జరిగిందంటే..?
కెనడా ఫుడ్ బ్యాంక్స్ నుంచి ఆహార పదార్థాలు అందిస్తుంటారు. వాస్తవానికి అవసరం ఉన్న వారు, పేదల కోసం ఫుడ్ అందజేస్తుంటారు. కెనడా టీడీ బ్యాంక్‌లో డాటా సైంటిస్ట్‌గా మెహుల్ ప్రజాపతి జాబ్ చేస్తున్నాడు. అతను కెనడా ఫుడ్ బ్యాంక్స్‌లో లైన్‌లో నిల్చొని ఉచితంగా ఆహార పదార్థాలు తీసుకున్నాడు. ఆ ఫుడ్ చూపిస్తూ వీడియో తీశాడు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. ఇంకేముంది ప్రజాపతి పనిచేసే కంపెనీ కూడా స్పందించింది.
కొలువు పోయింది
కాలేజీ, యూనివర్సిటీల వద్ద ఫుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తుంటారు. నెల నెల తాను ఎలా ఆహారం తీసుకుంటానో ఆ వీడియోలో ప్రజాపతి చక్కగా వివరించారు. ఓ బ్యాగ్‌లో నుంచి పండ్లు, కూరగాయాలు, బ్రేడ్, సాస్, పాస్తా తీసి మరి చూపించారు. టీడీ కెనడా బ్యాంకులో డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. ఏడాదికి 98 వేల డాలర్లు సంపాదిస్తున్నానని కోట్ చేశారు. 98 వేల డాలర్లు భారతదేశంలో రూ.60 లక్షల వరకు అవుతాయి. నెలకు రూ.5 లక్షలు సంపాదించే వ్యక్తి ఉచిత ఆహారం తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. టీడీ కెనడా బ్యాంక్ ప్రజాపతిని ఉద్యోగం నుంచి తొలగించింది.
మీలాంటి వాళ్ల కోసం కాదు
ఆ ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది మీలాంటి వాళ్ల కోసం కాదు. నిజంగా అవసరం ఉన్న వారి కోసం ఏర్పాటు చేశారు. ఫుడ్ బ్యాంక్ తెరిచాక కొందరు వచ్చి అవసరం ఉన్నవి మాత్రమే తీసుకెళతారని స్టోర్‌లో పనిచేసే ఒకరు మండిపడ్డారు. ఇలా తీసుకోవడం సరికాదని ఇంకొకరు అభిప్రాయ పడ్డారు. మరికొందరు మాత్రం ప్రజాపతిని సపోర్ట్ చేశారు. ఆహారం తీసుకోవడంతో జాబ్ పోవడంతో జాలి చూపించారు.
Read Latest International News or Telugu News