Home » ODI World Cup
ENG Vs NED: వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఊరట విజయం లభించింది. పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో పాయింట్ల పట్లికలో చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది.
Mohammad Shami: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా బౌలర్లు చెలరేగుతుండటంపై ఇటీవల పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత బౌలర్లకు వేరే బాల్స్ ఇస్తున్నారని, వాటిని చెక్ చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. హసన్ రజా వ్యాఖ్యలపై వసీం అక్రమ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా టీమిండియా బౌలర్ షమీ కూడా స్పందించాడు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికాడు.
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఎట్టకేలకు భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే సెమీస్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ బుధవారం పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు సాధించింది. బెన్ స్టోక్స్ సెంచరీతో రాణించగా ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ హాఫ్ సెంచరీతో సహకారం అందించాడు.
Shami Wife Hasin Jahan: వన్డే ప్రపంచకప్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న మహ్మద్ షమీ(Mohammad Shami) పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆలస్యంగా జట్టులోకి వచ్చినా ప్రత్యర్థులను అతడు తన బౌలింగ్‌తో బెంబేలెత్తిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. అంతేకాకుండా నాలుగు మ్యాచ్‌లలో కేవలం 7 సగటుతో 16 వికెట్లు సాధించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడి మాజీ భార్య ఆసక్తికర కామెంట్స్ చేసింది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా అజేయ డబుల్ సెంచరీ కొట్టి తన జట్టుకు ఒంటి చేతితో విజయాన్ని అందించాడు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఈ నెల 6న బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఏ స్థాయిలో వివాదానికి తెరదీసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ ఆటగాడు మాథ్యూస్ ‘టైమ్‌డ్ ఔట్’ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెయిన్ మాక్స్‌వెల్ అద్భుతం చేశాడు. అద్భుతం కూడా కాదు. మహాద్భుతం చేశాడనే చెప్పుకోవాలి. అఫ్ఘానిస్థాన్ విసిరిన 292 పరుగుల లక్ష్య చేధనలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఓటమి అంచున నిలిచింది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఇతడ్ని డేంజరస్ ఆటగాడిగా పరిగణిస్తుంటారు. అలా ఎందుకంటారో తాజాగా మరోసారి నిరూపితమైంది. త్వరగా వికెట్లు కోల్పోయి, తన ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన అతగాడు..
వన్డే ప్రపంచకప్‌లో పాయింట్ల టేబుల్‌లో చివరి స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఆశ్చర్యకరంగా ఓ విషయంలో మాత్రం టాప్‌లో నిలిచింది. క్యాచ్‌లు పట్టే విషయంలో ఇంగ్లండ్ ఎఫీషియన్సీ 85 శాతంగా నమోదైంది.
వన్డే ప్రపంచకప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఎడమచేతి వేలి గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంగా ప్రకటించింది.