Share News

ENG Vs NED: ఎట్టకేలకు ప్రపంచకప్‌లో భారీ స్కోరు చేసిన ఇంగ్లండ్

ABN , First Publish Date - 2023-11-08T18:17:23+05:30 IST

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఎట్టకేలకు భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే సెమీస్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ బుధవారం పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు సాధించింది. బెన్ స్టోక్స్ సెంచరీతో రాణించగా ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ హాఫ్ సెంచరీతో సహకారం అందించాడు.

ENG Vs NED: ఎట్టకేలకు ప్రపంచకప్‌లో భారీ స్కోరు చేసిన ఇంగ్లండ్

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ (England) పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్‌పై మినహాయిస్తే ఇప్పటివరకు అగ్ర జట్టుపై ఇంగ్లండ్ గెలవలేక చతికిలపడింది. అయితే పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలాన్‌ (87)తో పాటు స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ సెంచరీతో రాణించాడు. డేవిడ్ మలాన్ 74 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 87 రన్స్ చేశాడు. బెయిర్ స్టో (15), జో రూట్ (28) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. లివింగ్ స్టోన్ స్థానంలో జట్టులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ కూడా విఫలమయ్యాడు. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

కాగా ఒకవైపు వికెట్లు పడుతున్నా బెన్ స్టోక్స్ మాత్రం ఆచితూచి ఆడాడు. నెదర్లాండ్స్ బౌలర్లపై ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటించాడు. 84 బాల్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లలో డేవిడ్ మలాన్ కాకుండా సెంచరీ చేసిన ఆటగాడు స్టోక్స్ మాత్రమే. అతడికి ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ తన వంతు సహకారం అందించాడు. వోక్స్ 66 బాల్స్‌లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 51 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్, లాగన్ వాన్ బీక్ తలో రెండు వికెట్లు సాధించారు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే ఇంగ్లండ్, నెదర్లాండ్స్ సెమీస్ రేసు నుంచి తప్పుకున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా కేవలం పాయింట్ల పట్టికలో మాత్రమే ముందుడుగు వేయగలరు. సెమీస్‌కు వెళ్లే అవకాశం అయితే లేదు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-08T18:17:24+05:30 IST