Share News

ODI World Cup: ఆశ్చర్యపోవాల్సిందే.. ఈ విషయంలో ఇంగ్లండ్ టాప్..!!

ABN , First Publish Date - 2023-11-07T20:08:27+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో పాయింట్ల టేబుల్‌లో చివరి స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఆశ్చర్యకరంగా ఓ విషయంలో మాత్రం టాప్‌లో నిలిచింది. క్యాచ్‌లు పట్టే విషయంలో ఇంగ్లండ్ ఎఫీషియన్సీ 85 శాతంగా నమోదైంది.

ODI World Cup: ఆశ్చర్యపోవాల్సిందే.. ఈ విషయంలో ఇంగ్లండ్ టాప్..!!

ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రదర్శన తీసికట్టుగా ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగు స్థానంలో ఉంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. లీగ్ దశలో ఇంకా నెదర్లాండ్స్, పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయినా ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు మాత్రం లేవు. అయితే ఆశ్చర్యకరంగా ఓ విషయంలో మాత్రం ఇంగ్లండ్ టాప్‌లో నిలిచింది. క్యాచ్‌లు పట్టే విషయంలో ఇంగ్లండ్ ఎఫీషియన్సీ 85 శాతంగా నమోదైంది. ఈ విషయంలో టీమిండియా కలిసి ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉండటం అందరినీ అబ్బురపరుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ వంటి విషయాల్లో పేలవంగా ఆడుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఫీల్డింగ్ విషయంలో మాత్రం కొంచెం మెరుగ్గా కనిపిస్తోంది.


ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇంగ్లండ్ 34 క్యాచ్‌లు పట్టగా ఆరు క్యాచ్‌లు మాత్రమే జారవిడిచింది. దీంతో సక్సెస్ రేటు 85 శాతంగా ఉంది. టీమిండియా కూడా 34 క్యాచ్‌లు పట్టి ఆరు క్యాచ్‌లను డ్రాప్ చేసింది. పాకిస్థాన్, నెదర్లాండ్స్ క్యాచ్ ఎఫీషియన్సీ కూడా 85 శాతంగానే ఉండటం విశేషం. పాకిస్థాన్ ఇప్పటివరకు 40 క్యాచ్‌లు పట్టి 7 క్యాచ్‌లను జారవిడిచింది. నెదర్లాండ్స్ 35 క్యాచ్‌లను పట్టి ఆరు క్యాచ్‌లను డ్రాప్ చేసింది. అటు ఈ అంశంలో బంగ్లాదేశ్ ఐదో స్థానంలో నిలిచింది. ఆ జట్టు 32 క్యాచ్‌లను పట్టి 8 క్యాచ్‌లను నేలపాలు చేసింది. దీంతో బంగ్లాదేశ్ క్యాచ్ ఎఫీషియన్సీ 80 శాతంగా నమోదైంది. దక్షిణాఫ్రికా 55 క్యాచ్‌లు పట్టి 14 క్యాచ్‌లు డ్రాప్ చేసింది. ఎక్కువ క్యాచ్‌లు పట్టినా ఎక్కువ క్యాచ్‌లను డ్రాప్ చేయడం సఫారీలకు మైనస్‌గా మారింది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-07T20:35:55+05:30 IST