Home » Palnadu
Andhrapradesh: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ మొత్తానికి తాడేపల్లికి చేరింది. చిలకలూరి పేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయడుకు సీఎంవో నుంచి పిలుపు వెళ్లడంతో మంగళవారం తాడేపల్లికి చేరుకున్నారు. ఇటీవలే చిలకలూరిపేట ఇంచార్జి పదవి నుంచి మల్లెల రాజేష్ నాయుడును అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడును వైసీపీ నియమించింది.
Andhra Pradesh News: టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన ముఖ్యనేత గుంటుపల్లి నాగేశ్వరరావు(Guntupalli Nageswara Rao) కన్నూమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు(Palnadu) జిల్లాకు చెందిన బీసీ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు టీడీపీ(TDP)లో చాలా కీలకంగా ఉన్నారు.
Andhrapradesh: జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ - వైసీపీ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. గత రాత్రి అనంతవరం, దోడ్లేరు గ్రామాల్లో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు చెందిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. అయితే ఉదయం తొమ్మిది గంటల సమయంలో అమరావతి మండలం ధరణికోటలో వైసీపీ కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారు.
Andhrapradesh: టీడీపీ- జనసేన - బీజేపీ కూటమిని 5 కోట్ల ఆంధ్రులు స్వాగతిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి కూటమి సభ కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.
Andhrapradesh: జిల్లాలోని చిలకలూరిపేటలో ఈనెల 17న టీడీపీ కూటమి భారీ బహిరంగ సభకు పూనుకుంది. ఇందుకోసం బొప్పూడి వద్ద స్థలాన్ని టీడీపీ - జనసేన నేతలు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా స్థలాన్ని పరిశీలించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం ఉదయం బొప్పూడి చేరుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని యువనేత పరిశీలించారు.
పల్నాడు జిల్లా: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లిలో ఔదార్యం చూపించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో బస్సులు వెళ్లాయి. దీంతో బస్సులు లేక ప్రయాణికులు రోడ్లపై ఎండలో పడిగాపులుగాస్తున్నారు.
పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని అధికార వైసీపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా, ఓటర్లకు భారీ మొత్తంలో డబ్బులు పంపిణీ చేసి వారి ఓట్లను సంపాదించుకోవాలని భావిస్తోంది.
Andhrapradesh: పల్నాడు జిల్లా మాచర్లలో గిరిజన మహిళను వైసీపీ నేత ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపేస్తారా?! అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు.
పల్నాడు జిల్లా: పల్నాడులో కీలక నేత, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మార్చి 2వ తేదీన (శనివారం) తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ రోజు గురజాలలో జరిగే ‘రా కదలి రా’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని టీడీపీ ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti Brahma Reddy) అన్నారు.