Home » Palnadu
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య ఉమ్మడి ప్రకాశం జిల్లాలో (Prakasam) తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని.. ఇందుకు కారణం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డేనని (YV Subbareddy) సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) దగ్గర పంచాయితీ నడిచిన సంగతి తెలిసిందే...
ఏపీలో శాంతి భద్రతలు అల్లకల్లోలం అయ్యాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. నరసరావుపేటలో టీడీపీ నేతల బృందం పర్యటించింది. టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద్‌ను కొల్లు రవీంద్ర, బుద్దా వెంకన్న, ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు.
అంబటి రాంబాబు ఒంటెద్గు పోకడపై సమావేశంలో చర్చించారు. నియోజకవర్గంలో అంబటి అనుచరుల పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి మండలం ధరణికోటలో టీడీపీ కార్యకర్త సంజయ్‌పై వైసిపి దాడిని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తీవ్రంగా ఖండించారు.
ఖాసీం ముందుగా తన కొడుకు జాకీర్‌ను వెంట పెట్టుకుని రెహ్మాన్‌ను సత్తెనపల్లి శివారులో గొంతు నులిమి చంపేశారు. అనంతరం ధూళ్లిపాళ్ల గ్రామానికి వెళ్లి రహీమూన్, మాలింబిని బలమైన ఆయుధంతో కొట్టి హత మార్చారు. అనంతరం స్కూటీలో కొడుకు జాకీర్‌తో కలిసి ఖాసీం పరారయ్యాడు.
జిల్లాలోని నరసరావుపేట మండలం పమిడిమర్రు వద్ద స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్నపొలాల్లోకి దూసుకెళ్లింది.
పల్నాడు జిల్లా: సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలను ప్రజలకు చూపించటానికే బస్సు యాత్ర చేపట్టామని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.
రాష్ట్రంలో 7 వేల మంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 4వేల మంది టీచర్లను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన వారిని కూడా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేని స్కూళ్లకు పంపించడానికి
జగన్‌ను పారదోలే సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం దాచేపల్లి మండలం తంగెడలో రచ్చబండ - ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో యరపతినేని పాల్గొన్నారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలుగేళ్లలో పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై దాడులను యరపతినేని వివరించారు.
బాపట్లలో 15ఏళ్ల బాలుడు అతి దారుణంగా హత్యకు గురైన ఘటనపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత 15 రోజులుగా రాష్ట్రంలో విచ్చలవిడిగా అరాచకాలు జరుగుతున్నాయన్నారు. పొద్దున్నే కత్తిపోట్లు, మధ్యాహ్నం మర్డర్లు, సాయంత్రం సజీవదహనాలు జరుగుతున్నాయని తెలిపారు.