Home » Paris Olympics 2024
ప్రారంభోత్సవంలో ప్రదర్శించిన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జీస్‌సను, క్రైస్తవ మతాన్ని కించపరిచేలా ఉన్నాయని విమర్శలొచ్చాయి. అయితే మానవుల మధ్య హింస ఎంత అసంబద్ధమో చాటిచెబుతూ ప్రదర్శించిన ఆ కార్యక్రమాల వెనుక ఉద్దేశం మంచిదే అయినా..ప్రదర్శించిన తీరులో పొరపాట్లు జరిగాయని నిర్వాహకులు వివరించుకున్నారు. ఇక, పరేడ్‌లో దక్షిణ
పాకిస్తాన్ చరిత్రలో తొలి ఒలింపిక్ స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్ అర్షద్ నదీమ్ ఆ దేశంలో హీరో అయిపోయాడు. స్వర్ణం సాధించగానే అతడిపై దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాల వర్షం కురిపించాయి. నదీమ్‌ను రెండో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ప్రపంచ క్రీడల సంరంభం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి క్రీడాభిమానులను మురిపించారు. ఈ ఒలింపిక్స్‌లో ఓవరాల్‌గా చూసుకుంటే అమెరికా అత్యధిక పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ అథ్లెట్, జావెలిన్ థ్రో ప్లేయర్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. స్వర్ణం సాధిస్తాడని ఆశలు పెట్టుకుంటే రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇదే పోటీలో పాకిస్తాన్ జావెలిన్ థ్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ మెరుగైన ప్రతిభ కనబరిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
దాదాపు మూడు వారాల పాటు సాగిన ఉత్కంఠభరితమైన పారిస్ ఒలింపిక్స్(paris olympics 2024) గేమ్స్ నేటి రాత్రితో(ఆగస్ట్ 11న) ముగియనున్నాయి. భారత్‌కు గతసారి కంటే ఒక పతకం తక్కువ వచ్చింది. కానీ భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేసి దేశప్రజల హృదయాలను గెలుచుకున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో క్రీడల కంటే ఇతర విషయాలు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. క్రీడాకారుల కోసం రూపొందించిన ఒలింపిక్ గ్రామంలో సదుపాయాలు సరిగ్గా లేవంటూ ఇప్పటికే చాలా మంది అథ్లెట్లు తమ అసంతృప్తిని వెల్లడించారు. తాజాగా మరో అథ్లెట్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో మరో రెజ్లింగ్ పతకం కోసం పోటీ మొదలైంది. 76 కేజీల రెజ్లింగ్ విభాగంలో పోటీ పడుతున్న రీతికా హుడాకు శుభారంభం దక్కింది. శనివారం మధ్యాహ్నం జరిగిన తన ప్రారంభ రౌండ్ మ్యాచ్‌లో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిని సునాయాసంగా ఓడించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఎదురైన పరిస్థితి చాలా మందికి మేలుకొలుపుగా మారింది. కేవలం 100 గ్రాముల అదనపు బరువు కారణంగా వినేశ్ పతకం సాధించే అవకాశం కోల్పోవడం చాలా మందికి షాక్ కలిగించింది. ఈ నేపథ్యంలో ఇతర క్రీడాకారులకు ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు మేనేజ్‌మెంట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్(Vinesh Phogat) ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసిన విషయం విదితమే. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) ఇవాళ తీర్పు వెలువరించనుంది.
అర్షద్ నదీమ్.. క్రీడా ప్రపంచంలో ఇప్పుడీ పేరు మారుమోగుతోంది. పారిస్ క్రీడల జావెలిన్ త్రో ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, భారత హీరో నీరజ్ చోప్రాను వెనక్కినెట్టి ఒలింపిక్ చాంపియన్‌గా అవతరించాడు.