Share News

Arshad Nadeem: ఒలింపిక్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్‌‌పై కానుకల వర్షం.. అతడి మామ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

ABN , Publish Date - Aug 12 , 2024 | 11:47 AM

పాకిస్తాన్ చరిత్రలో తొలి ఒలింపిక్ స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్ అర్షద్ నదీమ్ ఆ దేశంలో హీరో అయిపోయాడు. స్వర్ణం సాధించగానే అతడిపై దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాల వర్షం కురిపించాయి. నదీమ్‌ను రెండో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

Arshad Nadeem: ఒలింపిక్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్‌‌పై కానుకల వర్షం.. అతడి మామ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Olympics Gold medalist Arshad Nadeem

పాకిస్తాన్ (Pakistan) చరిత్రలో తొలి ఒలింపిక్ (Paris Olympics) స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్ అర్షద్ నదీమ్ (Arshad Nadeem) ఆ దేశంలో హీరో అయిపోయాడు. స్వర్ణం (Gold Medal) సాధించగానే అతడిపై దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాల వర్షం కురిపించాయి. నదీమ్‌ను రెండో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పారిస్ నుంచి పాకిస్తాన్ చేరుకున్న అతడికి ఘన స్వాగతం లభించింది. దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు అతడికి ఘనంగా బహుమతులు ప్రకటించాయి.


ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి నీరాజనాలు అందుకుంటున్న నదీమ్‌కు అతడి మామ మహ్మద్ నవాజ్ కూడా ఓ ప్రత్యేకమైన బహుమతిని అందించాడు. తన అల్లుడికి అత్యంత విలువైన గేదెను (Buffalo) బహుమతిగా అందించినట్టు తెలిపాడు. నదీమ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, పేద కుటుంబానికి చెందిన నదీమ్‌లోని ప్రతిభను గుర్తించిన అతడి గ్రామస్తులు ఎంతో సహకరించారు. ఈవెంట్లకు హాజరు కావడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందరూ కలిసి అందించారు. దీంతో వారందరికీ ఏదో ఒకటి చేయాలని నదీమ్ భావిస్తున్నాడు.


తనకు రెండో అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వానికి నదీమ్ తాజాగా ఓ విజ్ఞప్తి చేశాడు. తమ గ్రామానికి రోడ్లు వేయాలని, వంట గ్యాస్ సరఫరా కూడా పూర్తి స్థాయిలో చేయాలని నదీమ్ విజ్ఞప్తి చేశాడు. ``క్రీడాకారులకు మద్దతుగా నిలుస్తున్న పాక్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా విజయం వెనుక గ్రామంలోని వారందరి పాత్ర ఎంతో ఉంది. వారి సహకారంతోనే నేను ఈవెంట్లకు వెళ్లగలిగా. వారిందరి రుణం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తా`` అంటూ నదీమ్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

Paris Olympics 2024: పారిస్‌లో సత్తా చాటిన అమెరికా.. పతకాల వేటలో చైనాను వెనక్కి నెట్టిన అగ్రరాజ్యం!


Paris Olympics 2024: నీరజ్ చోప్రా తల్లి నాకూ తల్లిలాంటిదే.. పాకిస్తాన్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్ కామెంట్స్!


Paris Olympics 2024: వారానికే రంగు కోల్పోతున్న ఒలింపిక్ మెడల్స్.. సంచలన విషయం బయటపెట్టిన అథ్లెట్!


Paris Olympics 2024: నేటితో ఒలింపిక్స్ వేడుకలు ముగింపు.. నెక్స్ట్ ఎక్కడంటే..?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 12 , 2024 | 11:47 AM