Home » Parliament Budget Session
కేంద్రంలో మూడోసారి ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) రేపు(జూన్ 24) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజే దాదాపు 280 మంది లోక్ సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
2024-25 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ జూలై మూడో వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఆ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. 2024-25 బడ్జెట్ రూపకల్పన ప్రక్రయ ప్రారంభించాలని ఆదేశించారు.
8వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 15 నుంచి 22వ తేదీ వరకు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారాలతో ఈ నెల మూడో వారంలో సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నాయి. ప్రమాణ స్వీకారాలు రెండ్రోజుల పాటు జరిగే అవకాశం ఉందని, అనంతరం స్పీకర్ ఎన్నిక ఉంటుందని తెలిపాయి.
ప్రధానమంత్రి నుంచి ఊహంచని విధంగా పిలుపు వస్తే ఆ ఆహ్వానం అందుకున్న వారికి ముచ్చెమటలు పట్టడమో, ఆనందంతో ఉక్కరిబిక్కిరి కావడమో సహజం. ఆసక్తికరంగా శుక్రవారం మధ్యాహ్నం ఇలాంటి ఆసక్తికర ఘటనే చోటుచేసుకుంది. 8 మంది ఎంపీలకు పీఎం నుంచి పిలుపువచ్చింది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శనివారంతో ముగియనున్న నేపథ్యంలో తమ పార్టీ సభ్యులకు బీజేపీ శుక్రవారంనాడు విప్ జారీ చేసింది. పార్లమెంటులో కీలక అంశాలపై చర్చ ఉన్నందున 10వ తేదీన ఎంపీలంతా తప్పనిసరిగా ఉభయ సభలకు హాజరుకావాలంటూ మూడు లైన్ల విప్‌లో కోరింది.
ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనూ ఓరకంగా సంచలనమే సృష్టించారు. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై విసుర్లు విసిరారు. అయితే తన వీడ్కోలు ప్రసంగంలో సభ్యులందరికీ క్షమాపణలు తెలిపారు.
PM Narendra Modi: అసలే ఎన్నికల కాలం.. అందివచ్చిన అవకాశాన్ని ప్రధాని మోదీ వదిలిపెడతారా? ఛాన్సే లేదు. వేదిక ఏదైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చాలా నేర్పరి ప్రధాని నరేంద్ర మోదీ. ఇంకేముంది.. ఈ ప్రభుత్వ కాలంలో చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో పార్లమెంట్ వేదికగా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశారు ప్రధాని మోదీ.
బీజేపీకి 400 సీట్లకు పైనే రావచ్చంటూ కాంగ్రెస్ రాజ్యసభ నేత మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దల సభలోనే ఛలోక్తులు విసిరారు. ఖర్గే ఇంత స్వేచ్ఛగా సభలో ఎక్కువ సేపు మాట్లాడటం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఫోర్లు, సిక్సర్లు కొట్టారని చెప్పారు.
PM Narendra Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే చివరి సమావేశాలు కావడంతో దేశాభివృద్ధి సహా, పొలిటికల్ అంశాలను సైతం టచ్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ తీరును తూర్పారబట్టడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైనా మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీపై మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆలోచనల్లో కాంగ్రెస్ పార్టీ అవుట్‌డేటెడ్ అయిందని, అందుకే అవుట్ సోర్సింగ్ ఇస్తోందని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని పశ్చిమబెంగాల్లోని ఒక పార్టీ సవాలు చేసిందని గుర్తుచేశారు.