Share News

Nirmala Sitaraman:జూలై మూడో వారంలో కేంద్ర బడ్జెట్‌!

ABN , Publish Date - Jun 14 , 2024 | 04:00 AM

2024-25 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ జూలై మూడో వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ఆ శాఖ సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు. 2024-25 బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రయ ప్రారంభించాలని ఆదేశించారు.

Nirmala Sitaraman:జూలై మూడో వారంలో కేంద్ర బడ్జెట్‌!

  • జూన్‌ 22న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

  • ఈ నెల 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక

న్యూఢిల్లీ, జూన్‌ 13 : 2024-25 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ జూలై మూడో వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ఆ శాఖ సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు. 2024-25 బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రయ ప్రారంభించాలని ఆదేశించారు. కచ్చితమైన ప్రణాళిక, సమగ్ర విశ్లేషణతో బడ్జెట్‌ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక ప్రాధాన్యాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలు, సవాళ్లకు అనుగుణంగా బడ్జెట్‌ ఉండాలని సూచించారు.
దీంతో కేంద్ర బడ్జెట్‌ జూలై మూడో వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, 53వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం న్యూఢిల్లీ వేదికగా జూన్‌ 22న జరగనుంది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్‌ ఎక్స్‌లో గురువారం ఓ పోస్టు పెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఇతర ప్రతినిధులు పాల్గొంటారు. 52వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం గతేడాది అక్టోబరులో జరిగింది. కాగా, లోక్‌సభ నూతన స్పీకర్‌ ఎన్నిక జూన్‌ 26న జరగనుంది. జూన్‌ 24న పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూలై 3 వరకు కొనసాగే అవకాశముంది.

Updated Date - Jun 14 , 2024 | 08:00 AM