Home » Parliament
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ(BJP) దూకుడు పెంచింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. కార్యచరణలో భాగంగా శనివారం నాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది.
పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ (BRS)కు బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్(BB Patil) రాజీనామా చేశారు. ఢిల్లీలోని బీజేపీ(BJP) జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో ఎంపీ బీబీ పాటిల్ కాషాయ కండువా కప్పుకున్నారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ప్రధాన పార్టీలైనా బీజేపీ(BJP), కాంగ్రెస్(C0ngress) పోటాపోటీగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(MP Bandi Sanjay Kumar), మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మధ్య సవాల్, ప్రతి సవాల్‌గా రాబోయే లోక్‌సభ ఎన్నికలు నిలుస్తున్నాయి.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు శనివారం నాడు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై అరగంట పాటు ఈ సమావేశం జరిగింది.
త్వరలో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఏడుగురు కేంద్ర మంత్రులను అధికార బీజేపీ తిరిగి నామినేట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారిని లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దించవచ్చనే ఊహాగానాలు ప్రస్తుతం రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎంపీ స్థానాలపై కేంద్ర బీజేపీ (BJP) అగ్ర నేతలు కసరత్తు ప్రారంభించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన బూస్టప్‌తో లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ అగ్ర నేతలు పావులు కదుపుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా రథయాత్రలను చేపడుతున్నామని తెలిపారు.
Telangana Parliament Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections) సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress).. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక మొదలుకుని.. ఎన్నికల ప్రచారం.. బీఆర్ఎస్, బీజేపీల (BRS, BJP) నుంచి కీలక నేతలను చేర్చుకునే విషయం వరకూ ఆచితూచి అడుగులేస్తూ ముందుకెళ్తోంది..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్దిష్ట సమాజానికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రధానిపై ఫైర్ అయ్యారు.