Share News

BJP: తెలంగాణ బీజేపీ నేతలతో ముగిసిన భేటీ.. కీలక అంశాలపై అమిత్ షా, నడ్డా చర్చ

ABN , Publish Date - Feb 24 , 2024 | 10:36 PM

బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు శనివారం నాడు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై అరగంట పాటు ఈ సమావేశం జరిగింది.

BJP: తెలంగాణ బీజేపీ నేతలతో ముగిసిన భేటీ.. కీలక అంశాలపై అమిత్ షా, నడ్డా చర్చ

ఢిల్లీ: బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు శనివారం నాడు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. 17 లోక్ సభ స్థానాల్లో ఆశావాహులు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఒక్కో స్థానానికి 3 నుంచి 4 మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఆశావాహుల జాబితాను అధిష్ఠానానికి తెలంగాణ బీజేపీ నాయకత్వం అందజేసింది. రాష్ట్ర కోర్ కమిటీ ఎంపిక చేసిన సుమారు 50 పేర్లతో కూడిన జాబితాను జేపీ నడ్డాకు తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ అందజేసింది.

ఫిబ్రవరి 29వ తేదీన జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తెలంగాణ నుంచి మెజార్టీ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ స్థానాల్లో సిట్టింగ్‌తో పాటు ఒకరి కంటే ఎక్కువమంది పోటీ పడుతున్న స్థానాలపై ఈ భేటీలో చర్చించారు. పోటీ చేసే అభ్యర్థుల బలబలాలపై నేతలు చర్చించారు. కొత్తగా పార్టీలోకి వచ్చే ఇతర పార్టీ నేతలపై సమావేశంలో నేతలు చర్చించారు. అభ్యర్థుల ఎంపికపై పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర నేతలు తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను బీజేపీ ఎంపీ, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు.

అగ్రనేతలతో ఆ విషయంపై చర్చించాం

’’తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలుస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తాం. రాష్ట్రంలో యాత్రలు సభలపై అగ్రనేతలతో చర్చించాం. పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్ కోసం చర్చ జరిగింది’’ అని లక్ష్మణ్ తెలిపారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, ఇన్‌చార్జులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ప్రకాశ్, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే యూపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోక్ సభ అభ్యర్థులపై ఈ సమావేశంలో బీజేపీ అధిష్ఠానం చర్చించింది.

Updated Date - Feb 24 , 2024 | 10:36 PM